ఆ సంస్థలను వదిలేది లేదు: లాక్‌డౌన్ పెనాల్టీల మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

By Siva Kodati  |  First Published Apr 23, 2020, 9:43 PM IST

లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలకు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆంక్షలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించిన సంస్థల యాజమాన్యాలకు జరిమానాలు విధిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. 


కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు గడపదాటి బయటకు రావొద్దని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, ప్రముఖులు విజ్ఞప్తి చేశారు.

అయినప్పటికీ కొందరు బాధ్యత లేకుండా రోడ్ల మీదకు రావడంతో పోలీసులు కొరడా ఝళిపించారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారి వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు  పోలీసులు.

Latest Videos

Also Read:సర్వే: కరోనా నుంచి మోడీ కాపాడగలరు.. 93 శాతం భారతీయుల నమ్మకం

అదే సమయంలో అన్ని రకాల పరిశ్రమలు  సైతం లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే కొన్ని అత్యవసర రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. అయితే లాక్‌డౌన్ సమయంలో కొన్ని సంస్థలు ఆంక్షలను ఉల్లంఘించడంతో వారిపై కేంద్రం జరిమానాలకు సిద్ధమైంది.

లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలకు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆంక్షలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించిన సంస్థల యాజమాన్యాలకు జరిమానాలు విధిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

ఎవరైనా ఉద్యోగి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలితే సంబంధిత కంపెనీల డైరెక్టర్లు, యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు హోంశాఖ ఆదేశాలు ఇచ్చిందని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని తెలిపింది.

Also Read:సెప్టెంబర్ నాటికి భారత్‌లో 111 కోట్ల మందికి కరోనా: అమెరికా సంస్థ అంచనా

లాక్‌డౌన్ నిబంధనలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించే వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2015 చట్టం కింద చర్యలు తీసుకుంటున్నాయని ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. మరోవైపు లాక్‌డౌన్ గడువును కేంద్రం మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్టేషనరీ, మొబైల్ రిచార్జ్, నిర్మాణ రంగానికి అవసరమైన వస్తువులు అమ్మే దుకాణాలు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. పిండి మిల్లులకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 
 

click me!