ఐదునెలల తరువాత అజ్ఞాతం వీడిన కిమ్ భార్య.. థియేటర్లో ప్రత్యక్షం..

Published : Feb 03, 2022, 08:47 AM ISTUpdated : Feb 03, 2022, 08:59 AM IST
ఐదునెలల తరువాత అజ్ఞాతం వీడిన కిమ్ భార్య.. థియేటర్లో ప్రత్యక్షం..

సారాంశం

ఉత్తర కొరియా ప్రస్తుతం కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంది.  జరుపుకుంటున్న ఇందులో భాగం కిమ్ జోంగ్ ఉన్-రిసోల్ జు దంపతులు  ఒక కళాప్రదర్శనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ వేదికపైకి వెళ్లి ప్రదర్శనకారులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సమయంలో ఆడిటోరియంలో ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టినట్లు  అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.

ఉత్తర కొరియా : కిమ్ జోంగ్ ఉన్ North Koreaకు అధినేత అయినప్పటికీ బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించడం మాత్రం చాలా అరుదే. ఆయనే కాదు కీలక బాధ్యతలు చూసుకునే ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే. 
ఇటీవల కిమ్ భార్య Ri Sol-ju గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోయారు. తాజాగా ఆమె ఓ థియేటర్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. దాదాపు ఐదు నెలల తర్వాత దంపతులు బహిరంగంగా కనిపించడంతో అక్కడి ప్రేక్షకులు అందరూ కేరింతలు, చప్పట్లతో ఆనందం వ్యక్తం చేసినట్లు అక్కడ అధికారిక మీడియా పేర్కొంది.

ఉత్తర కొరియా ప్రస్తుతం కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంది.  జరుపుకుంటున్న ఇందులో భాగం కిమ్ జోంగ్ ఉన్-రిసోల్ జు దంపతులు  ఒక కళాప్రదర్శనలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ వేదికపైకి వెళ్లి ప్రదర్శనకారులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ సమయంలో ఆడిటోరియంలో ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టినట్లు  అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.

అయితే,  గతేడాది సెప్టెంబర్ 9న  చివరిసారిగా ఆమె ఓ అధికారిక కార్యక్రమంలో Kim Jong-unతో కలిసి కనిపించిన తరువాత మరే కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత మళ్లీ ఆమె ప్రత్యక్షం కావడంతో అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, అంతకు ముందుకూడా కిమ్ భార్య రి సోల్ జూ దాదాపు ఓ ఎడాది పాటు అజ్ఞాతంలో ఉండి పోయారు. దాంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరో బిడ్డకు జన్మనివ్వనున్నారని  వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాస్తవానికి కోవిడ్ కారణంగా ఆమె బాహ్య ప్రపంచం ఎదుటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదని దక్షిణ కొరియా ఇంటిలిజెంట్ ఏజెన్సీలు నివేదికలు ఇచ్చాయి.

వారి పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారని పేర్కొన్నాయి. అనంతరం తన  మామ  దివంగత కిమ్ జోంగ్ ఇల్ జయంతి  వేడుకల్లో భర్త కలిసి  కనిపించారు. తాజాగా మరోసారి సుదీర్ఘకాలం తర్వాత బహిరంగ కార్యక్రమంలో పాల్గొని వార్తల్లో నిలిచారు. ఇక కిమ్ కు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే విషయంపై బహిరంగ సమాచారం లేనప్పటికీ ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు చెబుతుంటారు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?