క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా ఉంటాం.. కేబుల్ బ్రిడ్జి ఘటనపై స్పందిన అమెరికా అధ్యక్షుడు

Published : Nov 01, 2022, 01:46 AM ISTUpdated : Nov 01, 2022, 02:01 AM IST
క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా ఉంటాం.. కేబుల్ బ్రిడ్జి ఘటనపై స్పందిన అమెరికా అధ్యక్షుడు

సారాంశం

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా ఉంటాననీ, వారికి మద్దతునిస్తూనే ఉంటామని తెలిపారు.

గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శతాబ్దానికి పైగా పురాతనమైన ఈ వంతెన విస్తృత మరమ్మతులు, పునర్నిర్మాణాల తర్వాత ఐదు రోజుల క్రితం ప్రజలకు తిరిగి తెరవబడింది. అయితే ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో బ్రిడ్జి కూలిపోయి ఇప్పటి వరకు 130 మందికి పైగా ఈ ప్రమాదంలో మృతి చెందారు. 

బిడెన్ ఒక ప్రకటనలో.. ఈ రోజు.. నా హృదయం భారతదేశంతో ఉంది. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు జిల్, నేను మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం..ఈ క్లిష్ట సమయంలో మేము భారతీయ ప్రజలకు అండగా నిలుస్తాము. అమెరికా, భారతదేశ  పౌరులు అనివార్యమైన భాగస్వాములు," అని ఆయన పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు మరియు గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే.. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది.  

మోర్బీ వంతెన కూలిపోవడంపై ప్రధాని మోదీ సోమవారం నాడు గాంధీనగర్ లోని  రాజ్ భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ  ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు  సహయంతో  పాటు క్షతగాత్రులకు  సహాయం  త్వరగా అందేలా  చూడాలని ప్రధాని మోడీ ఆదేశించారు. మోర్బిలో ప్రమాదం  గురించి  అధికారులు ప్రధానికి వివరించారు. అలాగే.. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ వివరాలను కూడా  వివరించారు. దుర్ఘటనకు గల కారణాలపై ప్రధాని ఆరా తీశారు. బాధితులకు  అన్ని విధాలా సహాయం  అందించాలని  ప్రధాని కోరారు.

మరోవైపు.. బ్రిడ్జి  కూలిన ఘటనకు బాధ్యులుగా.. ఒరెవాకు గ్రూపునకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 304,306,114సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టుగా గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని విచారించనున్నారు. ఈ ఘటనపై విచారణను సిట్ చేయనుంది. ఈ వంతెన మరమ్మత్తులు చేసే బాధ్యతలను ఈ కంపెనీ నిర్వహిస్తుంది.  

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?