జూమ్ వీడియో కాల్ లో జెఫ్రీ టూబిన్ హస్త ప్రయోగం

Published : Oct 20, 2020, 10:41 AM IST
జూమ్ వీడియో కాల్ లో జెఫ్రీ టూబిన్ హస్త ప్రయోగం

సారాంశం

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీంతో.. ఆయన  ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. తాను చాలా పెద్ద తప్పు చేశానని.. తాను కెమేరా ఆఫ్ చేశాను అనుకొని అలా చేశానని ఆయన చెప్పడం గమనార్హం.  

ది న్యూయార్కర్ రచయిత, సీఎన్ఎన్ లీగల్ ఎనలిస్ట్ జెఫ్రీ టూబిన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.. ఇటీవల ఆయన ప్రముఖులతో జరిగిన ఓ జూమ్ వీడియో కాల్ లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రముఖులతో జరుగుతున్న మీటింగ్ లో ఆయన హస్త ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. కాగా..  ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా  తీవ్ర కలకలం రేపుతోంది.

పలువురు మ్యాగజైన్ సహోద్యోగులతో జరిగిన జూమ్ మీటింగ్ కాల్ లో ఆయన అలా హస్తప్రయోగం చేసుకోవడం గమనార్హం. కాగా.. దానిని చూసి ఆ మీటింగ్ లోని వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఆయన జూమ్ వీడియో కాల్ లో  అలా చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీంతో.. ఆయన  ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. తాను చాలా పెద్ద తప్పు చేశానని.. తాను కెమేరా ఆఫ్ చేశాను అనుకొని అలా చేశానని ఆయన చెప్పడం గమనార్హం.

“నేను జూమ్‌లో కనిపించలేదని అనుకున్నాను. జూమ్ కాల్‌లో ఎవరూ నన్ను చూడలేరని అనుకున్నాను. నేను జూమ్ వీడియోను మ్యూట్ చేశానని అనుకున్నాను.’’ అని ఆయన వివరణ ఇచ్చారు.

"నేను నా భార్య, కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులకు క్షమాపణలు కోరుతున్నాను." అని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఆయన చేసిన జుగుప్సాకరమైన ఘటనపై సంస్థ నిర్వాహకులు మండిపడుతున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు. అప్పటి వరకు ఆయనను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వారు చెప్పారు.

కాగా.. చాలా సంవత్సరాలుగా టూబిన్ సీఎన్ఎన్ లో పనిచేస్తున్నాడు. 1990 నుంచి ఆయన అక్కడ స్టాఫ్ రైటర్ గా పనిచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. కాగా.. ఆయనకు ఉన్న కీర్తి ప్రతిష్టలంతా ఈ జూమ్ కాల్ మీటింగ్ లో చేసిన పనితో మొత్తం కొట్టుకుపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే