ఐదుగురికి అమెరికా పౌరసత్వం: భారత సంతతి టెక్కీకి అమెరికన్ సిటిజన్‌షిప్

By narsimha lodeFirst Published Aug 26, 2020, 3:09 PM IST
Highlights

మరో రెండు మాసాల్లో ఎన్నికలు ఉన్నందున విదేశీల ఓటర్లను రాబట్టుకొనేందుకుగాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకొన్నాడు. ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వం అందించాు. ఈ కార్యక్రమంలో ట్రంప్ స్వయంగా పాల్గొన్నారు.


వాషింగ్టన్: మరో రెండు మాసాల్లో ఎన్నికలు ఉన్నందున విదేశీల ఓటర్లను రాబట్టుకొనేందుకుగాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకొన్నాడు. ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వం అందించాు. ఈ కార్యక్రమంలో ట్రంప్ స్వయంగా పాల్గొన్నారు.

ఇండియా, బొలివియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురికి అమెరికా పౌరసత్వం ఇచ్చారు. ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కు అమెరికా పౌరసత్వం దక్కింది.

హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్పో వారితో ప్రమాణం చేయించారు. ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా ఇవాళ తన కటుంబంలోకి ఆహ్వానించిందని ట్రంప్ పేర్కొన్నాడు.  ఇందుకు తాను సంతోషిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. రంగును, మతాన్ని అమెరికా చూడబోదని చెప్పడానికి ఇది సంకేతమన్నారు.

ఇండియాలో జన్మించి 13 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చిన సుధ తన కెరీర్ లో అనేక అద్భుతమైన విజయాలను సాధించింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మేరకు సుధా చీర కట్టుకొని వచ్చింది.  ట్రంప్ చేతుల మీదుగా ఆమె పౌరసత్వ పట్టాను అందుకొన్నారు.

click me!