కోమాలోకి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, పీఠం పై సోదరి

By team teluguFirst Published Aug 24, 2020, 10:11 AM IST
Highlights

కిమ్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాన్ని తమ దేశ ఇంటలిజెన్స్ సేకరించిందని చెప్పారు. ఈ వెల్లడించిన అధికారి కూడా హై ప్రొఫైల్ వ్యక్తి అవడంతో... ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంగా ఉన్నాడని పేర్కొంటూ... శస్త్ర చికిత్స జరిగిందని ఒకసారి, ఆయన హార్ట్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నారంటూ అనేక వార్తలు వెలువడ్డాయి. 

తాజగా కిమ్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాన్ని తమ దేశ ఇంటలిజెన్స్ సేకరించిందని చెప్పారు. ఈ వెల్లడించిన అధికారి కూడా హై ప్రొఫైల్ వ్యక్తి అవడంతో... ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు చేసిన  చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ అనే అధికారి  గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసాడు. 

కిమ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆయన కోమాలోకి వెళ్లడంతో...  ఉండటంతో ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి  కిమ్‌ యో జోంగ్ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. 

ఇకపోతే ఇప్పటికే కిమ్ అధ్యక్షా బాధ్యతలను తన సోదరికి అప్పగించాడని ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తోడు ఆమే నేరుగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించడం, దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇవ్వడం వంటి చర్యలతో లైం లైట్ లో ఉన్నారు. కిమ్ పెద్దగా కనపడకపోవడం, అయన సోదరి పూర్తి స్థాయిలో యాక్టీవ్ గా మారడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది.  

click me!