కరోనా సోకిన యువతికి ఊపిరితిత్తుల మార్పిడి: భారత సంతతి డాక్టర్ నేతృత్వం

By narsimha lode  |  First Published Jun 12, 2020, 2:22 PM IST

కరోనా సోకిన ఓ యువతికి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు అమెరికా వైద్యులు. ఈ ఆపరేషన్‌కి భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యుడు నాయకత్వం వహించాడు.



వాషింగ్టన్:కరోనా సోకిన ఓ యువతికి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు అమెరికా వైద్యులు. ఈ ఆపరేషన్‌కి భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యుడు నాయకత్వం వహించాడు.

అమెరికాలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోనే కరోనా రోగుల సంఖ్యలో అమెరికాలో ప్రథమ స్థానంలో నిలిచింది.  షికాగోలోని  నార్త్ వెస్ట్రన్ లో 20 ఏళ్ల యువతి ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుపత్రిలో చేరింది.

Latest Videos

అదే సమయంలో ఆమెకు కరోనా  సోకింది. దీంతో ఆమె  రెండు ఊపిరితిత్తులు పాడయ్యాయి. దీంతో ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఆమె బతకాలంటే ఊపిరితిత్తులను ట్రాన్స్ ‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని వైద్యులు నిర్ణయం తీసుకొన్నారు.

యాంటీబయాటిక్స్ కూడ నిరోధించలేని స్థితిలో ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టుగా డాక్టర్ అంకిత్ భరత్ చెప్పారు. ఊపిరితిత్తులు పాడు కావడంతో దాని ప్రభావం గుండెపై కూడ పడిందన్నారు. గుండెతో పాటు ఇతర అవయవాలపై కూడ దీని ప్రభావం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. 

ఆమెకు మెకానికల్ వెంటిలేటర్ అమర్చారు. ఆ తర్వాత ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్ర్బేన్ ఆక్సిజినేషన్ పరికరం అమర్చారు. ఈ పరికరం శరీరం వెలుపల నుండి రక్తానికి ఆక్సిజన్ ను జోడిస్తోంది. అంతేకాదు గుండె నాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి సహాయపడుతోంది.

ఆపరేషన్ చేయడానికి ముందు ఆమెకు కరోనా నుండి కోలుకొందన్నారు. ఊపిరితిత్తులు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే సమయంలో కూడ ఆమె అనారోగ్యంతోనే ఉందని డాక్టర్ అంకిత్ భరత్ తెలిపారు.

also read:ప్రపంచంలో కరోనా కేసుల పెరుగుదలపై డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్

సరైన ఊపిరితిత్తుల దాత దొరికేవరకు బాధిత యువతి రెండు రోజుల పాటు ఆపరేషన్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.బ్రెయిన్ డెడ్ అయిన  ఒకరి నుండి ఊపిరితిత్తులను బాధిత యువతికి ట్రాన్స్ ప్లాంటేషన్ చేశామని డాక్టర్ అంకిత్ భరత్ తెలిపారు.

ఈ ఏడాది మే 26వ తేదీన అస్ట్రేలియాలో తొలిసారిగా ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.కరోనా సోకిన 45 ఏళ్ల మహిళను కాపాడేందుకు ఊపిరితిత్తులను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. 
 

click me!