అద్భుతం : కోట్ల యేళ్ల శిలాజాన్ని కనిపెట్టిన ఆరేళ్ల చిన్నారి..

By AN Telugu  |  First Published Mar 29, 2021, 2:28 PM IST

బ్రిటన్ లో భారత సంతతికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు కోట్ల సంవత్సరాల నాటి శిలాజాన్ని కనుగొన్నాడు. పశ్చిమ మిడ్ ల్యాండ్స్ లోని తమ తోటలో తవ్వుతున్నప్పుడు అతడికి ఇవి కనిపించాయి.


బ్రిటన్ లో భారత సంతతికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు కోట్ల సంవత్సరాల నాటి శిలాజాన్ని కనుగొన్నాడు. పశ్చిమ మిడ్ ల్యాండ్స్ లోని తమ తోటలో తవ్వుతున్నప్పుడు అతడికి ఇవి కనిపించాయి.

ఆ చిన్నారి పేరు సిద్దక్ సింగ్ ఝామత్.. అందరూ ముద్దుగా సిద్ అని పిలుచుకుంటారు. అతడికి క్రిస్మస్ కానుకగా శిలాజాల అన్వేషణకు ఉపయోగపడే కిట్ లభించింది. వీటి సాయంతో సిద్ శోధించడం మొదలుపెట్టాడు.

Latest Videos

‘కీటకాలు, పురాతన మట్టి వస్తువులు, ఇటుకల వంటి వాటి కోసం తవ్వకాలు చేపట్టాను. అప్పుడు కొమ్ము లాంటి ఒక శిల నాకు కనిపించింది. అది జంతువులకు సంబంధించిన దంతం, గోరు లేదా కొమ్ము అయి ఉంటుంది అని అనిపించింది. అయితే అది ఒక పగడపు దిబ్బ భాగమని ఆ తర్వాత తేలింది. దీన్ని హార్న్ కోరల్ అంటారు’ అని సిద్ తెలిపాడు.

ఈ శిలాజం గురించి తెలిశాక తాను ఆనందోత్సాహాలతో లోనైనట్లు తెలిపాడు. సిద్ తండ్రి విష్ సింగ్.. ఫేస్ బుక్ లో ఒక శిలాజ బృందంలో సభ్యుడు. కుమారుడు వెలికితీసిన శిలాజ వయసు, ఇతర వివరాలను ఆయన తన బృందం సాయంతో వెలుగులోకి తెచ్చారు.

అవి లభించిన చోట భారీగా సముద్రం నత్తలు, స్క్విడ్ వంటివాటిని కూడా సిద్ కనుగొన్నాడని విష్ సింగ్ తెలిపారు. అవి లభించిన చోటు అవి లక్షల సంవత్సరాల నాటివని తనకు అర్థమైందన్నారు. ఈ తవ్వకాల్లో వెలుగు చూసిన హార్న్ కోరల్ 25.1 కోట్ల నుంచి 48.8 కోట్ల సంవత్సరాల నాటిదని అంచనా వేసినట్లు తెలిపారు.

అది రుగోసా కోరల్ అయి ఉంటుందన్నారు. అప్పట్లో ఇంగ్లాండ్.. పాంజియా అనే భారీ ఖండంలో భాగంగా ఉండేదని చెప్పారు. సముద్రం కింద ఉండేది అని తెలిపారు.

click me!