Ukraine Russia Crisis హంగేరీ చెక్‌పోస్టుకు రండి: ఉక్రెయిన్‌లో ఇండియన్లకు ఎంబసీ సూచన

Published : Feb 25, 2022, 01:36 PM ISTUpdated : Feb 25, 2022, 01:40 PM IST
Ukraine Russia Crisis హంగేరీ చెక్‌పోస్టుకు రండి: ఉక్రెయిన్‌లో ఇండియన్లకు ఎంబసీ సూచన

సారాంశం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఇండియన్ విద్యార్ధులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం నాడు కీలక సూచనలను కూడా కేంద్రం చేసింది. 

కీవ్: Ukraineలో చిక్కుకున్న Indian విద్యార్ధులకు ఎంబసీ కీలక సూచనలు చేసింది.  హంగేరీ బోర్డర్ చెక్ పోస్టుకు చేరుకోవాలని ఇండియన్ ఎంబసీ  భారతీయ Students కి సూచించింది.

ఉక్రెయిన్ లో సుమారు 16 వేల మంది భారతీయులున్నారని కేంద్రం ప్రకటించింది.  ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది విద్యార్ధులే ఉన్నారు.  ఇక్కడ చిక్కుకున్న వారిని స్వేధానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి Jai shankar రష్యా విదేశాంగ మంత్రితో  మాట్లాడారు. Hungary సరిహద్దు నుండి విద్యార్ధులను ఇండియాకు రప్పించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.హంగేరీ చెక్ పోస్టుకు చేరుకొనేందుకు ఉపయోగించే  వాహనాలపై విద్యార్ధులు భారత జాతీయ పతాకాన్ని వాడాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం ఇండియా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చర్యలు ప్రారంభించారు. రష్యా విదేశాంగ మంత్రితో  గురువారం నాడు జైశంకర్ మాట్లాడారు.

ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తో మాట్లాడానని దౌత్యమే  ఉత్తమ మార్గమమని తాను చెప్పానని Jaishankar ట్వీట్ చేశారు.ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు గాను రొమేనియా, హంగేరీ, స్లోవేకియా, పోలాండ్ సరిహద్దుల ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకొన్న వారిని భారత్ కు రప్పించేందుకు విదేశాంగ పర్యత్నాలను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో సుమారు 16 వేల మంది భారతీయులు ఉన్నారని భారత్ ప్రకలించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకొన్న భారతీయుల తరలింపునకు హంగేరియన్ విదేశాంగ మంత్రి పీటర్ స్జిజార్టో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.

గురువారం నాడు తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.  ఒక రోజు తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా దళాలు ప్రవేశించాయి. సుమారు 136 మంది రష్యా దాడిలో మరణించారు. 

ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా రష్యా ఆర్మీ దాడి చేస్తోందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. కీవ్ నగరానికి ఉత్తరాన ఉన్న చెర్నోబిల్ అణు విద్యత్ ప్లాంట్ ను  రష్యా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. బెలారస్ నుండి ఉక్రెయిన్ లోకి రష్యా దళాలు ప్రవేశించాయి.

రష్యా తనను నెంబర్ వన్ లక్ష్యంగా పెట్టుకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. తన  తర్వాత తన కుటుంబాన్ని నాశనం చేయడం రష్యా లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను రాజకీయంగా నాశనం చేయాలని అనుకొంటున్నారని జెలెన్ స్కీ చెప్పారు.

తాను రాజధానిలోనే ఉంటాను, తన కుటుంబం కూడా ఉక్రెయిన్‌లోనే ఉందని జెలెన్ స్కీ వివరించారు. రష్యా ప్రజలను కాపాడేందుకే ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించినట్టుగా పుతిన్ ప్రకటించారు.మరో వైపు ఉక్రెయిన్ పై దాడిని నిరసిస్తూ రష్యాలో పలు పట్టానాల్లో ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు పట్టణాల్లో ఆందోళనకారులు నిరసనలకు దిగుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Yearender: 2025 లో భీకర పోరు.. 2026లో ఏం జరగబోతోంది?
Aliens: 2026లో గ్ర‌హాంత‌ర‌వాసులు భూమిపైకి రానున్నారా.? వైరల్ అవుతోన్న వార్తలు