పాక్ ప్రధానిపై మాజీ భార్య సంచలన కామెంట్స్

Published : Feb 20, 2019, 11:00 AM IST
పాక్ ప్రధానిపై మాజీ భార్య సంచలన కామెంట్స్

సారాంశం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య రెహాంఖాన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య రెహాంఖాన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గతంలో పలుమార్లు ఇమ్రాన్ పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. పుల్వామా దాడి విషయంలో ఇమ్రాన్ పై ఆమె విరుచుకుపడ్డారు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పపెట్( తోలు బొమ్మ) అని రెహాంఖాన్ వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ప్రకటన చేసేందుకు పాక్ మిలటరీ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఇమ్రాన్ ఖాన్ ఎదురు చూశారని ఆమె ఆరోపించారు. ఇమ్రాన్ సిద్ధాంతాలతో రాజీపడి అధికారంలోకి వచ్చారని ఆమె చెప్పారు.

పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై ఇమ్రాన్ ఖాన్ నిన్న స్పందించిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన వెంటనే రెహాంఖాన్ ఇలా కామెంట్స్ చేశారు.  ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఏం మాట్లాడాలన్నా మిలటరీ అధికారుల వైపు చూస్తారని చెప్పారు. బ్రిటీష్ పౌరురాలైన రెహామ్ ఖాన్ గతంలో పాత్రికేయురాలిగా పనిచేశారు. 2015లో ఇమ్రాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న పది నెలలకే అతని నుంచి విడాకులు తీసుకున్నారు

PREV
click me!

Recommended Stories

Fake Doctors : పాకిస్థాన్ మొత్తం శంకర్ దాదా ఎంబిబిఎస్ లే.. ఎంతమంది నకిలీ డాక్టర్లున్నారో తెలుసా?
భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు