పాక్‌పై కరోనా పంజా: చేతులెత్తేసిన ఇమ్రాన్‌.. ఆదుకోవాలంటూ మోడీకి విజ్ఞప్తి

By Siva Kodati  |  First Published Apr 16, 2020, 5:51 PM IST
కోవిడ్ 19తో పోరాడలేకపోతున్నాం.. సాయం చేయండి అంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచదేశాలను కోరుతున్నారు. ఇదే సమయంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ను తమకు సరఫరా చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోడీని విజ్ఞప్తి చేశారు

కరోనా వైరస్ కారణంగా మన దాయాది దేశం పాకిస్తాన్ నానా అవస్థలు పడుతోంది. ఇప్పటికే ఆ దేశం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో పాటు మెజారిటీ ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారు.

దీనికి తోడు వైద్య సదుపాయాలు అంతంతగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో కరోనాను ఎదుర్కోలేక ఆ దేశ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ 19తో పోరాడలేకపోతున్నాం.. సాయం చేయండి అంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచదేశాలను కోరుతున్నారు.

మయంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ను తమకు సరఫరా చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోడీని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ కారణంగా తమ దేశం ఆర్ధికంగా అత్యంత దారుణ పరిస్ధితులను ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మా దేశానికి మీరే దిక్కు అని చేతులెత్తి దండం పెడుతూ అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను వేడుకున్నాడు. ఆరోగ్యం, సామాజిక రంగాల్లో తగినంతగా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామని.. రుణమాఫీ చేయాలని ఇమ్రాన్ వాపోయారు.

పరిశ్రమలు సైతం మూతపడ్డాయని, ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని పాక్ ప్రధాని ఓ వీడియోలో పేర్కొన్నారు. కాగా మలేరియాకు మందుగా వినియోగిస్తున్న హైడ్రాక్సీకోరోక్విన్‌ కరోనా నివారణలో మంచి ఫలితాలను ఇవ్వడంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్‌ వద్దకు క్యూకట్టింది.

ఇప్పటికే అమెరికా మనదేశం నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్‌లెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 6,505 మంది కోవిడ్ 19 బారినపడగా, వీరిలో 124 మంది మృత్యువాతపడ్డారు. 
click me!