శత్రువులు కూడా కన్నీరు పెట్టిన ఘటన.. హీరోషిమా విస్ఫోటనానికి 74ఏళ్లు!

By telugu teamFirst Published Aug 6, 2019, 8:40 AM IST
Highlights

రెండు నిమిషాల ముందు జనజీవనంతో అలరారిన నగరం ఇప్పుడు సాక్ష్యాధారాల్లేకుండా మాయమైపోయింది. ఇలా ఆ భారీ విస్ఫోటనం ఆగస్టు 6న చరిత్రని తుడిచిపెట్టడంతో పాటు కొత్త చరిత్రని సృష్టించింది. హిరోషిమా... అంటే వెడల్పైన దీవి అని అర్థం. జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లో ఇది అతి పెద్ద దీవి. అణు విస్ఫోటనం తర్వాత ఈ నగరం తిరిగి మామూలు నగరంలా అవుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం గడ్డికూడా మొలవదని అందరూ భావించారు.

హీరోషిమా... ఈ పేరు అందరికీ పరిచయమే. అమెరికా అణుబాంబు దాడికి విలవిలలాడిన ప్రాంతమే హీరోషిమా. సరిగ్గా 74 సంవత్సరాల క్రితం అంటే... 1945ఆగస్టు 6న అమెరికా... అణు బాంబుతో దాడి జరిగింది. ఈ అణుబాంబు దాడిలో అక్కడికక్కడే 70వేల మంది కలిబూడిదయ్యారు. క్షణాల్లో కళ్లుమూసి తెరిచేలోగా... మొత్తం శవాల గుట్టలా పేరుకుపోయింది. 

రెండు నిమిషాల ముందు జనజీవనంతో అలరారిన నగరం ఇప్పుడు సాక్ష్యాధారాల్లేకుండా మాయమైపోయింది. ఇలా ఆ భారీ విస్ఫోటనం ఆగస్టు 6న చరిత్రని తుడిచిపెట్టడంతో పాటు కొత్త చరిత్రని సృష్టించింది. హిరోషిమా... అంటే వెడల్పైన దీవి అని అర్థం. జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లో ఇది అతి పెద్ద దీవి. అణు విస్ఫోటనం తర్వాత ఈ నగరం తిరిగి మామూలు నగరంలా అవుతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం గడ్డికూడా మొలవదని అందరూ భావించారు.

ఈ విధ్వంసం చూసి... శత్రువులు కూడా కన్నీరు పెట్టడం గమనార్హం. కానీ, ఆ విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది... జీవాన్ని కాదు! రెండేళ్ళ తరువాత బూడిదమయమై వున్న ఆ నగరంలో మొలకలు రావడం మళ్లీ మొదలైంది. యురేనియం ఆనవాళ్ళు చెరిగి మెల్లగా జన జీవనం మొదలైంది. కానీ ఆ యురేనియం వెళ్ళిపోయినా దాని తాలూకు దుష్పరిణామాలు అలాగే మిగిలిపోయాయి.

 ఆ పేలుడులో బతికిన వారి జీవితాన్ని నరకంగా మార్చేందుకు డిసీజ్ ఎక్స్ అనే రోగం పుట్టుకొచ్చింది. ఒంటినిండా మచ్చలు వచ్చి రక్తపు వాంతులతో ప్రాణాలని మింగేస్తుందా రోగం. 6 లక్షలమంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. అది అప్పటి తరాలనేకాక రాబోయే తరాలని కూడా పీడిస్తుంది. ఈ రేడియేషన్ తాలూకు రోగాల ప్రభావం కనీసం వంద ఏళ్ళు ఉంటుందని అప్పటి డాక్టర్లు అంచనా వేశారు. 

వారి అంచనా తప్పు అని నిరూపించడానికి పూనుకున్నారు హిరోషిమా వాసులంతా. ఆ రోగానికి కారణమైన రేడియేషన్ తాలూకు పరిశోధనలు ఎన్నడూ జరగలేదు. డిసీజ్ ఎక్స్ సోకిన వారంతా ఆటంబాంబ్ క్యాజువాలిటీ కమిషన్‌కి చేరుకున్నారు. స్వచ్ఛందంగా వారి శరీరాలని అప్పచెప్పి ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ప్రయోగ నిమిత్తం వారిని నగ్నంగా పరీక్షించిన సందర్భాలు ఎన్నో! వీటన్నిటినీ పళ్ల బిగువున భరించారు వారంతా.ఫలితంగా ఇప్పుడు హిరోషిమాలో రేడియేషన్‌కారక వ్యాధులు ఎంతో తక్కువ. రాబోయే తరాలు సుఖంగా ఉండాలని, ఒక తరం చేసిన సాహసం, త్యాగాల ప్రతిఫలం హిరోషిమా!

click me!