ఇండియన్‌ టెక్కీలకు షాక్: ప్రతిభావంతులకే హెచ్-1 బీ వీసాలు

Published : Dec 21, 2018, 08:24 PM IST
ఇండియన్‌ టెక్కీలకు షాక్: ప్రతిభావంతులకే హెచ్-1 బీ వీసాలు

సారాంశం

హెచ్-1 బీ వీసా నిబంధనలను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులకే  వీసాను ఇవ్వాలని  ట్రంప్ సర్కార్ నిర్ణయించింది


వాషింగ్టన్: హెచ్-1 బీ వీసా నిబంధనలను ట్రంప్ సర్కార్ మరింత కఠినతరం చేస్తోంది. అత్యంత ప్రతిభావంతులకే  వీసాను ఇవ్వాలని  ట్రంప్ సర్కార్ నిర్ణయించింది.

ఈ ఏడాది హెచ్-1 బీ వీసాలకు గాను వచ్చిన ధరఖాస్తుల్లో అత్యంత ప్రతిభావంతులకే ఈ వీసాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు సెక్యూరిటీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. అమెరికాలో ఉన్న స్థానిక యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

ప్రతి ఏటా ప్రతి ఏడాది హెచ్-1 బీ వీసా ధరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.  దీంతో వచ్చిన ధరఖాస్తుల్లో  అత్యంత ప్రతిభావంతులను మాత్రమే తీసుకొంటే కంపెనీలకు మేలు జరుగుతోంది. పనిలో  నాణ్యత పెరుగుతోందన్నారు 

దీనికి తోడు అమెరికాలోని స్థానిక పౌరులకు కూడ ఉద్యోగావకాశాలు చేసుకొనే అవకాశం దక్కుతోందన్నారు. స్థానిక నియామకాలు మరింత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు  హోమ్‌ల్యాండ్  ప్రతినిధులు ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

అమెరికాలో మిడ్ ట‌ర్మ్ ఎన్నిక‌లు ఎందుకు నిర్వ‌హిస్తారు.? భార‌తీయుల‌పై వీటి ప్ర‌భావం ఏంటి?
దుబాయ్‌లో భారతీయుడికి రూ. 1300 లాటరీ టిక్కెట్‌కు 12.9 కోట్ల రూాపాయల లాటరీ