ప్రపంచవ్యాప్తంగా బుధవారం 1,421 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం 25,57,181 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 182 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 1,77,641 మంది మృతిచెందారు.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరిన్ని కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 25లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కేవలం అమెరికాలోనే 8లక్షలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. స్పెయిన్, ఇటలీ దేశాల్లో పరిస్థితి అదుపులో ఉంది. చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బుధవారం 1,421 కొత్త కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం 25,57,181 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 182 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు 1,77,641 మంది మృతిచెందారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇవాళ 420 కొత్తగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,19,164 ఉండగా, ఇవాళ 22 మంది చనిపోయారు.
అలాగే ఇప్పటి వరకు అమెరికాలో మొత్తం 45,340 మంది మృతిచెందారు. ఇందులో ఎక్కువగా న్యూజెర్సీ, న్యూయార్క్ నగరంలోనే చనిపోయారు. స్పెయిన్‌లో మొత్తం 20,04,178 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 21,282 మంది చనిపోయారు.