పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 30మంది మృతి...

By AN TeluguFirst Published Jun 7, 2021, 12:25 PM IST
Highlights

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీ కొనడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రాంతంలోని ఘోట్కిలోని రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైలు మిల్లట్ ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టింది. 

దీంతో మిల్లాట్ ఎక్స్ ప్రెస్ రైలు భోగీలు బోల్తాపడ్డాయి. ఘోట్కి, ధార్కి, ఒబారో, మీర్పూర్ మాథెలో ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థిని ప్రకటించినట్లు ఘోట్కి డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా తెలిపారు. 

ఈ ప్రమాదంలో సుమారు 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పగా.. ఆరు నుంచి ఎనిమిది పూర్తిగా నాశనమైనట్లు ఆయన పేర్కొన్నారు. గాయపడిన ప్రయాణికులకు వైద్య సహాయం అందించడానికి వైద్యులు, వైద్య సిబ్బందిని విధుల్లోకి రావాల్సిందిగా పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా సహాయ చర్యల కోసం రోహ్రీ నుంచి రైలు బయలుదేరిందని పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
click me!