బంపర్ ఆఫర్:వ్యాక్సిన్‌ వేసుకొంటే ఉచితంగా బీరు

Published : May 23, 2021, 01:01 PM ISTUpdated : May 23, 2021, 01:02 PM IST
బంపర్ ఆఫర్:వ్యాక్సిన్‌ వేసుకొంటే  ఉచితంగా బీరు

సారాంశం

వ్యాక్సిన్ తీసుకొంటే  బీరు  అందిస్తామని అమెరికాలో మందు ప్రియులకు  ఆఫర్ అందింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశ్యంతో  పలు  ఆఫర్లను ప్రజలకు అందిస్తున్నారు. 


వాషింగ్టన్: వ్యాక్సిన్ తీసుకొంటే  బీరు  అందిస్తామని అమెరికాలో మందు ప్రియులకు  ఆఫర్ అందింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశ్యంతో  పలు  ఆఫర్లను ప్రజలకు అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకొనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు తాయిలాలను అందిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడ వ్యాక్సిన్ విషయంలో  తాయిలాలు అందిస్తున్నారు. మే మాసంలో వ్యాక్సిన్ తీసుకొంటే  ఉచితంగా బీరు , వైన్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. మ్యూజియాలు, పార్కుల్లోకి ఉచితంగా ప్రవేశిస్తామని అనుమతిస్తామని కొన్ని రాష్ట్రాల్లో బంపరాఫర్లు ప్రకటించారు. 

గేల్ బర్స్టెయిన్  సోషల్ మీడియా వేదికగా ఓ ఆఫర్ ను ప్రకటించారు.  ఉచిత మద్యంతో టీకా వైపు ప్రజలను నడిపించవచ్చన్నారు. మా కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలో‌నార్క్  ఈ ఆలోచనను బయటపెట్టాడు.  ఎరీ కౌంటీ  ఆరోగ్య కమిషనర్  బర్స్ స్టెయిన్  ఈ విషయాన్ని ప్రకటించారు.  టీకా వేసుకొన్న వారికి యూఎస్ కౌంటీ ఉచితంగా బీరును అందిస్తుందని ప్రకటించారు. మరోవైపు  వ్యాక్సిన్ తీసుకొన్న వారికి లాటరీని అందిస్తామని కూడ కొన్ని రాష్ట్రాల్లోఆఫర్లను ప్రకటించారు. అమెరికాలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నవారికి మాస్క్ అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే