ఇండోనేషియాలో విషాదం: ఓడలో అగ్ని ప్రమాదం,14 మంది సజీవ దహనం

Published : Oct 25, 2022, 10:53 AM IST
ఇండోనేషియాలో విషాదం: ఓడలో అగ్ని ప్రమాదం,14 మంది సజీవ దహనం

సారాంశం

తూర్పు ఇండోనేషియాలో సోమవారంనాడు ఓడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 240 మంది సురక్షితంగా బయటపడ్డారు. 

జకార్తా: తూర్పు ఇండోనేషియాలో సోమవారంనాడు ఓడలో అగ్నిప్రమాదం వాటిల్లి 14  మంది  మృతి చెందారు. అధికారులు ప్రకటించారు.కేఎం ఎక్స్ ప్రెస్ కాంటికా 77 అనే ఓడ తూర్పు నుసాటెంగ్ గారా ప్రావిన్స్ లోని తైమూరు ద్వీపం తీరంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో ఓడలో ఉన్న 14 మంది  సజీవదహనమయ్యారు. ఓడలో ఉన్నవారు ప్రాణాలను రక్షించుకొనేందుకు  నీటిలోకి దూకారు.

 అయితే  నీటిలో దూకిన 254 మందిలో 240 మందిని  రెస్క్యూ  సిబ్బంది కాపాడారని సుసాటెంగ్ గారా రవాణా ఏజెన్సీ అధిపతి ఇస్యాక్ సుకా  స్థానిక మీడియాకి తెలిపారు.240 మందిని కాపాడినట్టుగా రెస్క్యూ  సిబ్బంది తెలిపారు.

కుపాంగ్ నుండి అలోర  ద్వీపంలోని కలాబాహీ పట్టణానికి ఓడ ప్రయాణీస్తున్న సమయంలో ఓడ టాప్ డెక్ కాలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన విషయం  తెలిసిన వెంటనే  రెస్క్యూ బోట్లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఓడలో మంటలు ఎక్కువగా ఉన్న కారణంగా సహాయక చర్యలను  చేపట్టేందుకు  రెస్క్యూ  సిబ్బంది  తీవ్రంగా కష్టపడ్డారు. 

ఈ ఘటనలో  గాయపడిన  కొందరు షాక్ లో ఉన్నారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు కుపాంగ్ లోని  పోలీసు ఆసుపత్రికి తరలించారు.ఓడలో మంటలు  వ్యాపించిన తర్వాత లైఫ్ జాకెట్లను ఉపయోగించి నీటిలోకి దూకారు. కొందరు నీటిలో ఈదుకొంటూ  ఒడ్డుకు చేరుకున్నారు. ఈ బోటులో 250 మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంది.17 వేల ద్వీపాతో కూడిన ఆగ్నేసియా ద్వీప సమూహంలో సముద్ర ప్రమాదాలు  సర్వసాధారణం.,ఇక్కడ భద్రతా  ప్రమాణాలు తక్కువగా ఉంటాయి.2018లో సుమత్రా ద్వీపంలోని సరస్సులో  ఫెర్రీ మునిగిపోవడంతో  150 మంది మరణించిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో