డ్యామ్ కోసం సేకరించిన మొత్తం 40 మిలియన్ల డాలర్లు.. యాడ్స్ కోసం ఖర్చు పెట్టింది 63 మిలియన్ల డాలర్లు.. ఎక్కడంటే?

Published : Sep 16, 2022, 04:45 PM IST
డ్యామ్ కోసం సేకరించిన మొత్తం 40 మిలియన్ల డాలర్లు.. యాడ్స్ కోసం ఖర్చు పెట్టింది 63 మిలియన్ల డాలర్లు.. ఎక్కడంటే?

సారాంశం

పాకిస్తాన్ మరో అవినీతి బాగోతం బయటపడింది. ఓ మెగా డ్యామ్ నిర్మాణానికి ప్రజలు విరాళాలు ఇవ్వాలని అప్పటి పీఎం ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఓ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆ ఫండ్‌కు ప్రజల నుంచి 40 మిలియన్ డాలర్లు వచ్చాయి. కానీ, ఆ డ్యామ్ ప్రచారానికి 63 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్టు తెలియవచ్చింది.  

న్యూఢిల్లీ: దేశ అభివృద్ధిలో డ్యామ్ వంటి మౌలిక వసతుల నిర్మాణం చాలా అవసరం. సాగు నీటి కోసం, విద్యుదుత్పత్తితోపాటు వరదలను నివారించడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. సాధారణ ప్రజలకు వీటి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి ఓ భారీ డ్యామ్‌ నిర్మించాలని పాకిస్తాన్ తలపించింది. కానీ, అంచనా వ్యయం పెరుగుతూ పోయింది. కేటాయించిన బడ్జెట్ కంటే ఖర్చు విపరీతంగా పెరిగింది. దీంతో కోర్టు సూచనల మేరకు ఓ ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం కోసం ప్రజలూ తమ వంతుగా సహాయం చేయాలని కోరారు. 

ఎన్నో ప్రయోజనాలు కల్పించే ఈ డ్యామ్ నిర్మాణం కోసం ఎందరో పాకిస్తానీలు కదిలారు. సాధారణ ప్రజలు మొదలు క్రికెటర్లు, సెలెబ్రెటీలు, ప్రముఖులు తమ వంతుగా విరాళాలు ఇచ్చారు. తమ జీతాల్లో కొంత భాగం ఆ ఫండ్‌కు పంపారు. కానీ, తాజాగా, ఈ ఫండ్‌లోని డొల్లతనం బయటపడింది. డ్యామ్ నిర్మాణం కోసం ఈ ఫండ్‌కు సుమారు 40 మిలియన్ల డాలర్లు వచ్చాయి. కానీ, ఆ డ్యామ్ ప్రచారానికి పెట్టిన ఖర్చు తెలిస్తే మాత్రం ఖంగుతింటారు. ఈ డ్యామ్ కోసం సేకరించిన దాని కంటే కూడా ఎక్కువగా అంటే సుమారు 63 మిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టినట్టు బయటపడింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికివస్తున్నది. 

పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డ్యామ్ నిర్మాణం కోసం ప్రజల నుంచి 40 మిలియన్ డాలర్లు వచ్చాయని, కానీ, యాడ్స్ కోసం 63 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్టు వివరించింది. అయినప్పటికీ ఈ డ్యామ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కూడా లేదు.

1980లో పూర్తి కావాల్సిన ఈ డ్యామ్ నిర్మాణ వ్యయం పెరుగుతున్నదని చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో 2018లో అప్పటి పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్ ఓ ఫండ్ ఏర్పాటుకు ప్రతిపాదించారని వైస్ న్యూస్ ఓ కథనంలో పేర్కొంది. అప్పుడు డ్యామ్ నిర్మాణ అంచనా వ్యయం 14 బిలియన్ డాలర్లుగా ఉన్నది.

ప్రజలు ఒక బిలియన్ డాలర్లు సమకూర్చాలని విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు ఆ ఫండ్ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాయింట్ లీడర్షిప్ కింద ఉన్నది. అయితే, 2019లో జస్టిస్ సాకిబ్ నిసార్ రిటైర్ అయ్యారు. అసలు ఆ ఫండ్ నిర్మాణం కోసం కాదని, ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాత్రమేనని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?