ఘోర అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

Siva Kodati |  
Published : Mar 29, 2019, 10:18 AM IST
ఘోర అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

సారాంశం

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలో ఇరుకుగా ఉండే బనాయ్ అనే కమర్షియల్ ప్రాంతంలోని ఎఫ్‌ఆర్ టవర్స్ అనే ఎత్తయిన భవంతిలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలో ఇరుకుగా ఉండే బనాయ్ అనే కమర్షియల్ ప్రాంతంలోని ఎఫ్‌ఆర్ టవర్స్ అనే ఎత్తయిన భవంతిలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంతమంది కిటికీల్లోంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి మరణించినట్లు స్థానికులు తెలిపారు.

ప్రాణాలు దక్కించుకునేందుకు జనం భారీ క్రేన్లు, సైనిక హెలికాఫ్టర్ల సాయంతో వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది చనిపోగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌