ఆఫ్ఘనిస్తాన్: బయటకొస్తున్న పాత తాలిబన్లు.. మహిళా ప్రభుత్వోద్యోగులపై ఆంక్షలు, గడప దాటొద్దని వార్నింగ్

Siva Kodati |  
Published : Aug 24, 2021, 08:17 PM IST
ఆఫ్ఘనిస్తాన్: బయటకొస్తున్న పాత తాలిబన్లు.. మహిళా ప్రభుత్వోద్యోగులపై ఆంక్షలు, గడప దాటొద్దని వార్నింగ్

సారాంశం

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని తాలిబన్లు హెచ్చరించారు. వారంతా ఇళ్లల్లోనే వుండాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు హెచ్చరించారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్‌లో కో ఎడ్యుకేషన్‌ను తాలిబన్లు నిషేధించిన సంగతి తెలిసిందే.   

అందరికీ క్షమాభిక్ష పెట్టామని ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకోవచ్చని.. అలాగే మహిళలు సైతం ఉద్యోగాలు చేసుకోవచ్చని తాలిబన్లు తొలి రెండు రోజులు శాంతి మంత్రాలు జపించారు. అయితే రోజులు గడిచే కొద్ది తమలోని పాత మతాచారాలను బయటకు తీస్తున్నారు తాలిబన్లు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తాజాగా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని తాలిబన్లు హెచ్చరించారు. వారంతా ఇళ్లల్లోనే వుండాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు హెచ్చరించారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్‌లో కో ఎడ్యుకేషన్‌ను తాలిబన్లు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ యూనివర్సిటీలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు ఇబ్బందిగా భావిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే