జపాన్ లో ప్రముఖ కబూకీ నటుడి ఆత్మహత్యాయత్నం.. తల్లిదండ్రుల మృతి

By SumaBala BukkaFirst Published May 18, 2023, 1:36 PM IST
Highlights

ఎన్నొసుకే ఇచికావా అనే జపాన్ ప్రసిద్ధ కబూకీ నటుడు ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. అతని తల్లిదండ్రులు మృతి చెందారు. దీనిమీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

జపాన్ : జపాన్‌కు చెందిన ప్రసిద్ధ కబుకి నటుడు తన సొంతింట్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. అతనితో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఇంట్లో కుప్పకూలిపోయిన స్థితిలో కనిపించారు. కాగా తల్లిదండ్రులు చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారని స్థానిక మీడియా గురువారం తెలిపింది.

ఎన్నొసుకే ఇచికావా (47) అనే నటుడు టోక్యోలోని తన ఇంట్లోని ఒక గదిలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నట్లు అతని ఏజెంట్ గుర్తించాడని జిజి ప్రెస్ ఏజెన్సీ, ఇతర స్థానిక మీడియా తెలిపింది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. కబుకీ యాక్టర్, అతని 76 ఏళ్ల తండ్రి, అతని 75 ఏళ్ల తల్లి అపస్మారక స్థితిలో పడి ఉండడం గుర్తించారు. వారిని పరీక్షించిన వైద్యులు తలిదండ్రులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

విమానం ప్రమాదంలో అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయిన చిన్నారులు క్షేమం.. కొలంబియా అధ్యక్షుడి ట్వీట్..

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరికి ఇంట్లో ఇచికావా రాసిన సూసైడ్ నోట్‌ దొరికిందని స్థానిక మీడియా తెలిపింది. పేరు చెప్పడానికి నిరాకరించిన టోక్యో పోలీసు ప్రతినిధి, డెబ్బైల వయస్సులో ఉన్న ఒక పురుషుడు, ఒక స్త్రీ మరణించినట్లుగా నిర్ధారించారు. తదుపరి సమాచారం తెలుపలేదు. 

ఇచికావా తన గదిలో కూర్చున్నట్లు గుర్తించారు. అలాగే అపస్మారక స్థితిలో ఉన్నాడు. అయితే, అతని పరిస్థితి విషమంగా లేదని తెలిపారు. ఇచికావా 1980లో కబుకి నటుడిగా అరంగేట్రం చేశాడు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. సాంప్రదాయ థియేటర్‌లో ప్రదర్శనలు ఇస్తూనే..టెలివిజన్ షోలు, సినిమాలలోకి ప్రవేశించాడు.

లండన్, ఆమ్‌స్టర్‌డామ్, పారిస్ ఒపేరా హౌస్‌లో కబుకీని ప్రదర్శించాడు. అతని అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, నృత్య ప్రదర్శన కోసం లారెన్స్ ఆలివర్ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు.

click me!