China Bomb Blast: చైనాలో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 42 మందికి తీవ్ర గాయాలు..

Published : Feb 13, 2022, 12:06 PM IST
China Bomb Blast: చైనాలో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 42 మందికి తీవ్ర గాయాలు..

సారాంశం

China Bomb Blast: చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో భారీ బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ  పేలుడులో ఒకరు మరణించగా, 42 మంది తీవ్రంగా గాయపపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చైనా పోలీసు ద‌ళాలు తెలిపారు.    

China Bomb Blast: ఈశాన్య చైనాలోని షెన్యాంగ్ నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బస్సులో పేలుడు సంభవించిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 42 మంది గాయ‌పడ్డారు. 
క్షతగాత్రుల్లో ఇద్దరి ప‌రిస్థితి తీవ్రంగా ఉంద‌ని తెలుస్తుంది.  గాయపడిన వారికి స‌మీపంలో ఆస్పత్రుల్లో చేర్పించారు. షెన్యాంగ్‌లోని హువాంగ్ జిల్లాలోని హువాంగ్ స్ట్రీట్, నింగ్‌షాన్ రోడ్ జంక్షన్ వద్ద ఈ సంఘటన జరిగిన‌ట్టు చైనా అధికారులు ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా వారు స్థిమితంగా ఉన్నారని చైనా అధికారులు ప్రకటించారు.

భారీ పేలుడుతో షెన్యాంగ్ నగరం ఉలిక్కిపడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. ఈ ఘటన తరువాత చైనా పోలీసు అప్ర‌మ‌త్తమ‌య్యారు. ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. 

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన చైనా ప్ర‌భుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అక్కడి ప్రభుత్వం వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో వీడియో క్లిప్‌లో, పేలుడు తరువాత ప్రజలు బస్సు దగ్గర రోడ్డు పక్కన కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !