అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ మరోసారి గెలిస్తే.. ప్రపంచ పటంలో భారీ మార్పులేనా, భారత్‌ పరిస్ధితేంటీ..?

By Siva Kodati  |  First Published Jan 16, 2024, 7:34 PM IST

అయోవా కాకసస్‌లో విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుస్తారనే వాదన మరింత బలపడింది. రిపబ్లికన్ పార్టీలోని బలమైన అభ్యర్ధుల్లో ఒకరైన వివేక్ రామస్వామి రేసు నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్ధతుదారుగా మారారు. జో బైడెన్ రేటింగ్‌లు సైతం క్షీణించడంతో ట్రంప్.. పునరాగమనం గురించి అమెరికాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.


అయోవా కాకసస్‌లో విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుస్తారనే వాదన మరింత బలపడింది. రిపబ్లికన్ పార్టీలోని బలమైన అభ్యర్ధుల్లో ఒకరైన వివేక్ రామస్వామి రేసు నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్ధతుదారుగా మారారు. జో బైడెన్ రేటింగ్‌లు సైతం క్షీణించడంతో ట్రంప్.. పునరాగమనం గురించి అమెరికాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎస్టోనియా ప్రధాని కాజా కల్లాస్ ఇటీవల అమెరికాను సందర్శించారు. అయితే ఈ సమావేశం కేవలం వైట్‌హౌస్ వరకే పరిమితం చేయలేదు. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సీనియర్ సలహాదారులను కూడా ఆయన కలిశారు. ట్రంప్ మరోసారి గెలిచే అవకాశం వుందని చాలా మంది ప్రపంచ స్థాయి నేతలు ఇప్పుడు నమ్ముతున్నారు. 

అయోవాలో ట్రంప్ విజయం సాధించిన వార్త చైనాకు చేరిందో లేదో .. అక్కడి స్థాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ట్రంప్ పునరాగమనంపై చైనా వ్యాపార వర్గాలు సానుకూలంగా లేవు. ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా వున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు వారికి కళ్లెదుట కనిపించాయి. ట్రంప్ తన హయాంలో పలు చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధించడంతో , చైనీస్ ఆర్ధిక వ్యవస్థకు పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి. అయితే వాణిజ్యం విషయంలో మాత్రం ట్రంప్ అధికారంలోకి వస్తే యూకేకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగవచ్చు. యూఎస్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై బైడెన్ అంతగా ఆసక్తి చూపలేదు.

Latest Videos

undefined

అమెరికాపై ఎక్కువగా ఆధారపడినందుకు ఐరోపాలోని యూఎస్ మిత్రదేశాలపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడిన ఏడాది తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగకుంటే నాటో గ్రూప్ దాదాపుగా చనిపోయేది. వాతావరణ మార్పులు, వాణిజ్యం, భద్రతతో సహా అనేక సమస్యలపై ట్రంప్‌తో పనులు చక్కబెట్టుకోవడంలో యూరోపియన్ నేతలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ట్రంప్ కనుక మరోసారి అధ్యక్ష పగ్గాలు అందుకుంటే మాత్రం యూరోపియన్ నేతలకు మరోసారి కష్టాలు తప్పకపోవచ్చు. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌కు స్వేచ్ఛా హస్తాన్ని అందించేందుకు ట్రంప్ సుముఖంగా వుండటంతో హమాస్‌తో యుద్ధం తారాస్థాయికి చేరే అవకాశం వుంది. ఇజ్రాయెల్‌కు ట్రంప్ స్వతహాగానే మిత్రుడు. ఆయన అధ్యక్షుడిగా వున్నప్పుడు ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలే నెలకొల్పారు. సౌదీ అరేబియా, యూఏఈలోనూ ట్రంప్‌కు మంచి మిత్రులు వున్నారు. మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ట్రంప్ రాకతో సానుకూల పరిస్ధితులు ఏర్పడే అవకాశం వుంది. 

అలాగే అమెరికాకు చిరకాల శత్రుదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సాన్నిహిత్యం వున్నందున మాస్కోతో సంబంధాలు సాధారణ స్ధితికి చేరుకోవచ్చు. ట్రంప్ తన హయాంలో సాధించిన పెద్ద విజయం .. ప్రపంచాన్ని అనేక ప్రధాన యుద్ధాల నుంచి దూరంగా వుంచడమేనని విశ్లేషకులు చెబుతారు. పుతిన్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ట్రంప్ స్వస్తి పలికే అవకాశాలు లేకపోలేదు. 

ఇక భారతదేశం విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్రమోడీతో బంధం కారణంగా 2016 నుంచి 2020 మధ్య న్యూఢిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సుహృద్భావ వాతావరణం వుంది. అయితే ఇరుదేశాల మధ్య వాణిజ్య సుంకాలపై ట్రంప్ అసంతృప్తితో వుండటంతో ఈ సెక్టార్‌లో భారత్‌కు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కానీ పెద్ద ఎత్తున రక్షణ కొనుగోళ్లు మంజూరు చేయడానికి సుముఖంగా వుండటం భారత్‌కు అడ్వాంటేజ్. 
 

click me!