పాక్ నేత నోట..‘సారే జహాసే అచ్ఛా’.. సోషల్ మీడియాలో వైరల్

By telugu teamFirst Published Sep 2, 2019, 6:36 AM IST
Highlights

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడం భారత్‌ అంతర్గత వ్యవహారమని పాకిస్థాన్‌ రాజకీయ నాయకుడు పేర్కొన్నారు. కశ్మీర్ విషయంపై స్పందించడం... అది కూడా భారత్ కి మద్దతుగా వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. 

భారత్-పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత శత్రుత్వం ఉందని ప్రపంచం మొత్తం తెలుసు. కశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య ఇప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కాగా... ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఈ వివాదం కాస్త మరింత పెద్దదయ్యింది. యుద్ధానికి మేము సిద్ధం అంటూ పాక్ ఫ్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పాక్ కి చెందిన ఓ నేత భారత్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడం భారత్‌ అంతర్గత వ్యవహారమని పాకిస్థాన్‌ రాజకీయ నాయకుడు పేర్కొన్నారు. కశ్మీర్ విషయంపై స్పందించడం... అది కూడా భారత్ కి మద్దతుగా వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్‌కు చెందిన మత్తహిదా ఖౌమీ మూమెంట్‌ (ఎంక్యూఎం) పార్టీ వ్యవస్థాపకుడు అల్తాఫ్‌ హుస్సేన్‌ తాజాగా లండన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజల మద్దతుతోనే అక్కడి ప్రభుత్వం ఆర్టికల్‌ను రద్దు చేయగలిగిందని అభిప్రాయపడ్డారు. అంతేకాక ''సారే జహాఁ సే అచ్ఛా హిందుస్థాన్‌ హమారా'' అనే పాటను కూడా ఆయన పాడారు.

పాకిస్థాన్‌లో ప్రభుత్వంపై సైనిక వ్యవస్థ ఆధిపత్యం ఎలా ఉంటుందో వివరించారు. ''పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యమే లేదు. నేరుగా మిలటరీ జనరల్స్‌ ఆధిపత్యమే ఉంటుంది. పాకిస్థాన్‌లోని వ్యవస్థ మొత్తం భారత్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) అత్యంత శక్తిమంతమైన సంస్థ.

దీని తర్వాత సైన్యాధిపతి, ఈయన తర్వాత ఆధిపత్యం ప్రధానికి ఉంటుంది. దేశంలోని అన్ని రకాల వ్యవస్థలూ ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే పని చేయాల్సి ఉంటుంది. మిలటరీ, ఐఎస్‌ఐ కింద పార్లమెంటు, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, రాజకీయ వ్యవస్థ మొత్తం రబ్బరు స్టాంపులా పని చేయాల్సి ఉంటుంది.'' అని వ్యాఖ్యానించారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారాయి.

click me!