న్యూయార్క్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రవాది కుట్ర

By narsimha lodeFirst Published Sep 1, 2019, 3:21 PM IST
Highlights

అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లో దాడులకు ఓ పాకిస్తాన్ జాతీయుడు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అవైస్ చుథారీ అనే 19 ఏళ్ల యువకుడు ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడై.. న్యూయార్క్‌లో ఉగ్రదాడులకు కుట్రపన్నడంతో పాటు కొంతమంది యువతను ఐసిస్ వైపు ఆకర్షించేందుకు పథకం రచించాడు

అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లో దాడులకు ఓ పాకిస్తాన్ జాతీయుడు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అవైస్ చుథారీ అనే 19 ఏళ్ల యువకుడు ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడై.. న్యూయార్క్‌లో ఉగ్రదాడులకు కుట్రపన్నడంతో పాటు కొంతమంది యువతను ఐసిస్ వైపు ఆకర్షించేందుకు పథకం రచించాడు.

దాడికి పక్కా ప్రణాళికలు రూపొందించడంతో పాటు , లక్ష్యాన్ని ఎంచుకుని రెక్కీ కూడా చేసినట్లు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. రద్దీగా ఉండే ప్రాంతాలు, పాదచారులే లక్ష్యంగా దాడికి కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు.

అండర్ కవర్ ఏజెంట్లు చేసిన ఆపరేషన్‌లో చుధారీ బాగోతం బయటపడింది. అతనిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ అధికారులు శుక్రవారం ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిందిగా న్యాయమూర్తులు ఆదేశించారు.

గతంలో 201లోనూ ఓ పాకిస్తానీ అమెరికన్ న్యూయార్క్ టైమ్ స్వ్కేర్‌ ప్రాంతంలో ఓ కారులో అమర్చిన బాంబును పోలీసులు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

click me!