Elon Musk: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్ .. మరో సంచలనానికి ఎలాన్ మస్క్ శ్రీకారం.. 

Published : Jan 31, 2024, 12:28 AM IST
Elon Musk: మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్ .. మరో సంచలనానికి ఎలాన్ మస్క్ శ్రీకారం.. 

సారాంశం

 Elon Musk: మరో సంచలనానికి ఎలాన్ మస్క్ శ్రీకారం చుట్టారు. మారుతున్న సాంకేతికతతో  పోటీ పడేలా  మానవుడ్ని రూపొందించబోతున్నారు.  ఆలోచనలతోనే కూర్చున్నచోటు నుంచే మెదడు ద్వారా మన పనులను ఆపరేట్ చేయొచ్చు

Elon Musk: శాస్ర్త సాంకేతిక రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి టెక్నాలజీపైనే మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఏదో రకంగా ఆధారపడుతున్నాం. అయితే..మారుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని మానవుడు సులభతరం జీవనాన్ని అనుభవిస్తున్నా.. భవిష్యత్తులో మాత్రం కంప్యూటర్ తో పోటీ పడి పనిచేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే అత్యాధునిక సాంకేతిక వచ్చి పలు సంచలన మార్పులకు శ్రీకారం చూడుతోంది. అదే సమయంలో మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో మరో సంచలన ప్రయోగానికి ముందడుగు పడింది. ఈ ప్రయోగం ద్వారా ఏకంగా మనిషి మెదడు( ఆలోచనలు)తో తన చూట్టు ఉన్నా వాటిని కంట్రోల్ చేయవచ్చు. ఎలాంటే.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ కి మెదడులో చిప్ ను అమర్చినట్టు.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అలాంటి ప్రయోగమే చేయనున్నారు. 

ఈ ఇలాంటి సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్. తన న్యూరాలింక్ సంస్థ తాజాగా మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చింది. ఈ క్రమంలో మెదడులో చిప్ ను అమర్చే తొలి పరీక్ష విజయవంతమైందని ఎలోన్ మస్క్ ప్రకటించారు. చిప్‌ను అమర్చిన వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని మస్క్ చెప్పారు. మస్క్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించాడు.
 
మానవ మెదడులో చిప్‌ను అమర్చేందుకు న్యూరాలింక్‌ సంస్థకు గత ఏడాది మేలో US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. ప్రారంభ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎలాన్ మస్క్ అన్నారు. న్యూరాలింక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. స్వతంత్ర సంస్థాగత సమీక్ష బోర్డు నుండి ఆమోదం పొందబడింది. వైర్‌లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ని పరీక్షించే వైద్య పరికరం PRIME (Precise Robotically Implanted Brain Computer Interface) ట్రయల్ విజయవంతమైంది. ఈ పరీక్ష ఉద్దేశ్యం మానవ మెదడులో చిప్‌ను అమర్చడం ద్వారా భద్రతను అంచనా వేయవచ్చు.

న్యూరాలింక్ అంటే ఏమిటి?

న్యూరాలింక్ అనేది స్టార్టప్, దీనిని ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ 2016లో కొంతమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్‌లతో కలిసి ప్రారంభించారు. మానవ మెదడులో అమర్చ గల చిప్ ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడానికి న్యూరాలింక్ పనిచేస్తుంది. ఈ చిప్స్ సహాయంతో నడవలేని, మాట్లాడలేని, చూడలేని వికలాంగులు కొంత వరకు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారని విశ్వసిస్తుంది. అలాగే.. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరగడం, రిమోట్ తో టీవీలను, ఏసీలను కంట్రోల్ చేయడం సాధారణమే.. కానీ, రానున్న రోజుల్లో ఈ సాంకేతికలను ఉపయోగించి.. మనిషి తన ఆలోచనలతోనే వీటన్నింటినీ కంట్రోల్ చేస్తాడు. ఈ చిన్న చిప్ సహాయంతో కంప్యూటర్లు లేదా ఫోన్‌ల వంటి పరికరాలకు కూడా తన ఆలోచనలతో ఆపరేట్ చేయవచ్చు.   

చిప్ ఎలా ఉంటుంది

రోగి మెదడులో 5 రూపాయాల నాణేం పరిమాణంలో ఉన్న ఒక పరికారాన్ని కంపెనీ శస్త్రచికిత్స ద్వారా అమర్చుతారు. లింక్ అనే ఇంప్లాంటేషన్ ద్వారా ఈ టెక్నాలజీ పని చేస్తుంది. దీనితో పాటు, కంపెనీ చాలా నిధులను కూడా సేకరించింది. అలాగే.. మస్క్ కంపెనీ కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి..కంపెనీ ఇంతకుముందు ల్యాబ్‌లో జంతువులపై చిప్ పరీక్షను నిర్వహించింది, దీంతో కంపెనీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 2022 సంవత్సరంలో కంపెనీ అమెరికా కేంద్ర విచారణను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. పరీక్ష సమయంలో కంపెనీ 1500 జంతువులను చంపిందని, వీటిలో ఎలుకలు, కోతులు, పందులు మొదలైనవి ఉన్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది.

 

PREV
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..