వాషింగ్టన్ లో కాల్పులు: ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

Published : Sep 20, 2019, 10:14 AM ISTUpdated : Sep 20, 2019, 10:16 AM IST
వాషింగ్టన్ లో కాల్పులు: ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

సారాంశం

అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

వాషింగ్టన్:అమెరికాలోని వాషింగ్టన్ లో గురువారం నాడు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. అమెరికాకు చెందిన ఓ టీవీ ఛానెల్ ఈ మేరకు ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రికి తరలిస్తున్నవారి దృశ్యాలను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

ఈ ఘటన తర్వాత  పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఈ ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు. వైట్‌హౌస్ కు సమీపంలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకొంది.

మరో వైపు ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని ఫాక్స్ టీవీ ప్రకటించింది. అమెరికా కాలమాన ప్రకారంగా గురువారం నాడు రాత్రి 10 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొందని ఆ ఛానెల్ ప్రకటించింది.

ఈ ఏడాది ఆగష్టు 23వ తేదీన  జరిగిన కాల్పుల్లో 112 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో జరిగిన ఘటనలో 19 మంది మృతి చెందారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే