మద్యం మత్తులో.... విమానంలో మహిళపై మూత్రం పోసిన ప్యాసింజర్..!

Published : Jan 04, 2023, 10:24 AM IST
మద్యం మత్తులో.... విమానంలో మహిళపై మూత్రం పోసిన ప్యాసింజర్..!

సారాంశం

ఆలస్యంగా నైనా విమాన సంస్థకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో అతను చేసిన వికృత చర్యలను కూడా రివీల్ చేయడం గమనార్హం. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కి సదరు మహిళ ఫిర్యాదు  చేయగా... ఈ ఘటనపై దర్యాప్తు కు ఆదేశించారు.

పీకలదాకా మద్యం సేవి.. ఆ మత్తులో ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో... ఓ మహిళా ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఎయిర్ ఇండియా  విమానంలో చోటుచేసుకుంది. విమానం న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన నవంబర్ 26వ తేదీన చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన జరిగిన సమయంలో బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం గమనార్హం. విమానం ఢిల్లీలో ల్యాండ్  అయిన తర్వాత... అతనిని ఫ్రీగా వదిలేశారు. అయితే.... మహిళ మాత్రం వదల్లేదు. ఆలస్యంగా నైనా విమాన సంస్థకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో అతను చేసిన వికృత చర్యలను కూడా రివీల్ చేయడం గమనార్హం. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కి సదరు మహిళ ఫిర్యాదు  చేయగా... ఈ ఘటనపై దర్యాప్తు కు ఆదేశించారు.

తన భద్రత విషయంలో విమాన సిబ్బంది కనీసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని.... కనీసం తనను పట్టించుకోలేదని ఆమె బాధను వ్యక్తం చేశారు. విమానం ల్యాండ్ అయిన సమయంలో అందరికీ లంచ్ సర్వ్ చేశారని.. ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసిన కాసేపటికే... ఓ వ్యక్తి తన సీటు దగ్గరకు వచ్చి.. తన ప్యాంట్ జిప్ తీశాడని ఆ తర్వాత... తన ప్రైవేట్ పార్ట్స్ బయటకు తనకు కనిపించేలా చూపించడం మొదలుపెట్టాడని ఆమె వాపోయింది.

అనంతరం ఆమెపై మూత్రం పోశాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కదలకుండా.. అక్కడే ఉండిపోయాడు. పక్కనే ఉన్న.. మరో ప్యాసింజర్ అతన్ని అక్కడి నుంచి వెళ్లమని అరవగా అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే ఆమె దుస్తులు, బ్యాగ్ అన్నీ.. మూత్రంతో తడిచిపోయాయి. ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసి... తర్వాత తన దుస్తులను ఆమె మార్చుకున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత కానీ... ఆమెకు మళ్లీ కూర్చోవడానికి సీటు కేటాయించలేదట. తన ఇబ్బంది విమాన సిబ్బంది కనీసం పట్టించుకోలేదని..ఆమె తనకు జరిగిన విషయాన్ని తెలియజేశారు.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే