నేనే గెలిచా.. డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ ట్వీట్

By telugu news teamFirst Published Nov 16, 2020, 4:33 PM IST
Highlights

అటు ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌నకుసూచించారు. ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని, ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఘోర ఓటమిని చవి చూశారు. ఈ ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. కాగా.. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు.. అయినప్పటికీ తానే గెలిచానంటూ ట్రంప్ షాకింగ్ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడన్న విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారానే ప్రపంచానికి తెలియజేశారు.

ఈ ఎన్నికల్లో బైడెన్ గెలుపుని అంగీకరించినట్లే అంగీకరించి.. గెలుపు కోసం మోసం చేశారని.. అందుకే తానే గెలిచానంటూ ట్వీట్ చేయడం గమనార్హం. 'ఐ వన్ ది ఎలక్షన్' అంటూ  సోమవారం ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ట్రంప్‌ను ట్రోల్‌ చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ ట్వీట్‌ను ట్విటర్‌ ఫ్లాగ్ చేసింది. ఈ పోస్ట్ క్రింద ఒక హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

 

I WON THE ELECTION!

— Donald J. Trump (@realDonaldTrump)

అటు ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్‌నకుసూచించారు. ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని, ఇకనైనా తన అహాన్ని పక్కన పెట్టి దేశ హితం కోసం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. తాజా ఎన్నికల ప్రకారం అమెరికా పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయినట్టు స్పష్టమవుతోందనీ, ట్రంప్‌ నిరంతరం అసత్యాలు ప్రచారం చేస్తే ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీన పడిందని భావి‍స్తాయన్నారు. తమ నాయకుడు జో బైడెన్‌ చేతిలో ట్రంప్ చిత్తుగా ఓడిపోయారని డెమొక్రాటిక్ వర్గాలు సంబరాల్లో ముగినితేలుతున్నసంగతి తెలిసిందే. ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం, స్టేట్-బై-స్టేట్ ఎలక్టోరల్ సిస్టంలో బైడెన్‌ 306 ఓట్లను గెల్చుకున్నారు.

click me!