మనవాళ్లే కాదండోయ్.. బ్రెజిల్ డాక్టర్లూ అంతే.. రాజకీయ నాయకుడి కడుపులో కత్తెర పెట్టి కుట్లేశారు..6 రోజుల తర్వాత

By SumaBala BukkaFirst Published Feb 8, 2023, 12:38 PM IST
Highlights

ఆపరేషన్ సమయంలో, బ్రెజిలియన్ సర్జన్లు అనుకోకుండా ఒక స్థానిక రాజకీయ నాయకుడి పొట్టలో  కత్తెరను వదిలేశారు. 

బ్రెజిల్ : డాక్టర్లు కడుపులో కత్తెర్లు, కత్తులు.. దూది ఉండలు మర్చిపోయే ఘటనలు మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని తెలుస్తోంది ఈ ఘటనతో.. జర్మనీలో జరిగిన ఓ ఘటనలో ఆపరేషన్ తరువాత ఓ డాక్టర్ రాజకీయనాయకుడి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశాడు. దీంతో తీవ్ర కడుపునొప్పితో ఆరు రోజులు బాధ పడిన అతనికి ఆరు రోజుల తరువాత మళ్లీ ఆపరేషన్ చేసి కడుపులోని కత్తెరను తీసేశారు.  

డాక్టర్ల పొరపాటున రోగి కడుపులో కత్తెరను పెట్టేసిన సందర్భాలు భారతదేశంలో అనేక సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. అయితే బ్రెజిల్‌లో ఒక సర్జన్ అనుకోకుండా స్థానిక రాజకీయ నాయకుడి కడుపులో ఆపరేషన్ చేసిన కత్తెరను వదిలివేయడంతో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి, 15 మంది గాయాలు..

మాటో గ్రోస్సో సెంట్రల్-వెస్ట్రన్ రీజియన్‌లోని నోవా శాంటా హెలెనా మునిసిపాలిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక కౌన్సిల్‌మెన్ క్లీటన్ జోస్ జనాట్టాకు జనవరి 20న కణితి తొలగించే ఆపరేషన్ చేశారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఆ తరువాత అంతకుముందు ఉన్న సమస్య తీరిపోయి.. పొట్ట తేలిగ్గా అయ్యింది. కానీ, ఆపరేషన్ జరిగిన ఆరు రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న రాజకీయ నాయకుడు పొట్టలో ఏదో ఇబ్బందిగా ఉన్నట్లు గ్రహించాడు.

దీంతో సీటీ స్కాన్ చేయగా అతని పేగుల్లో భారీ కత్తెర కనిపించింది. బ్రెజిలియన్ న్యూస్ పోర్టల్ G1 ప్రకారం, రాజకీయ నాయకుడు తన పొత్తికడుపులో ఉండిపోయిన కత్తెరను తొలగించడానికి జనవరి 26న మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ తర్వాత అతను బాగానే ఉన్నాడని చెప్పారు. స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, ఇది నిజమేనని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తేలింది.

ఇలాంటి సంఘటనలు భారతదేశంలో చాలా సాధారణం, ప్రతి సంవత్సరం ఇలాంటి అనేక కథనాలు వార్తల్లోకి వస్తాయి. గత ఏడాది, 30 ఏళ్ల మహిళ ఐదేళ్ల క్రితం సిజేరియన్ చేస్తున్నప్పుడు తన శరీరంలో ఫోర్సెప్స్‌ను వదిలేశారని వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై చర్య తీసుకున్న కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. త్వరలో నివేదిక సమర్పించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరారు. సెప్టెంబరు 17న, కోజికోడ్ వైద్య కళాశాల వైద్యులు కోజికోడ్ నివాసి హర్షినియాకు గత ఐదేళ్లుగా కడుపులో ఉన్న "దోమ ధమని ఫోర్సెప్స్" ను తొలగించడానికి పెద్ద శస్త్రచికిత్స నిర్వహించారు.

click me!