కాబూల్‌లో ఆత్మాహుతి దాడి: ఐదుగురి మృతి, 50 మందికి గాయాలు

Published : Sep 03, 2019, 07:42 AM IST
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి: ఐదుగురి మృతి, 50 మందికి గాయాలు

సారాంశం

కాబూల్ లో మరో సారి ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ దాడిలో ఐదుగురు మృతి చెందారు.


కాబూల్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో సోమవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. 

ఈ ఘటన కాబూల్ లోని సెంట్రల్ కాబూల్ లలో చోటు చేసుకొంది. కాబూల్ లోని గ్రీన్ విలేజ్ సమీపంలోని పలు అంతర్జాతీయ సంస్థలు ఉన్న నివాస ప్రాంతంలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.

ఈ ఘటనలో ఐదుగుురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ అంతర్గత వ్యవహరాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రహిమి ప్రకటించారు.

క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే