పడవలో అగ్ని ప్రమాదం: 8మంది మృతి,33 మంది గల్లంతు

Published : Sep 03, 2019, 06:35 AM ISTUpdated : Sep 03, 2019, 06:37 AM IST
పడవలో అగ్ని ప్రమాదం: 8మంది మృతి,33 మంది గల్లంతు

సారాంశం

లాస్ ఏంజెల్స్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 6 మంది మృతి చెందారు,. 

లాస్ఏంజెల్స్: ఉత్తర కాలిఫోర్నియా సమీపంలోని శాంటాక్రూజ్ దీవి తీర ప్రాంతంలో సముద్రంలో పడవ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా,
మరో 33 గల్లంతైనట్టుగా అమెరికా ప్రకటించింది.

సముద్ర తీరానికి 20 కి.మీ దూరంలో స్కూబా డైవ్ చేసే వాణిజ్య పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆరుగురిని రక్షించారు. మిగిలిన 33 మంది ఆచూకీ లభ్యం కాలేదు. అమెరికా కాలమానం ప్రకారంగా సోమవారం తెల్లవారుజామున 3;30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది. 

పడవలో ఎంతమంది ఉన్నారు.. ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది తప్పించుకొన్నారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గల్లంతైన వారు తప్పించుకొన్నారా... లేదా సముద్రంలో కొట్టుకుపోయారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌