చూపు తిప్పలేనంత అందమైన బీచ్.. అదో సూసైడ్ స్పాట్

By telugu teamFirst Published Sep 7, 2019, 10:04 AM IST
Highlights

ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ నేత కుమారుడు శ్రీహర్ష...యూకేలో చనిపోయిన సంగతి తెలిసిందే. అతను చనిపోయింది కూడా ఈ బీచ్ లోనే కావడం గమనార్హం. ఈ బీచ్ గురించి తెలిసిన వారు ఎవరైనా.. శ్రీ హర్ష మృతి కూడా ఆత్మహత్యగానే భావిస్తారు. 2004 నుంచి ఈ బీచ్ లో 5,500మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం.

బీచ్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా..? సాయం సంధ్య వేళల్లో... బీచ్ ఒడ్డున నడుస్తూ వెళ్తుంటే... అలలు మన కాళ్లకు తగులుతూ ఉంటే... ఆహా.. ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. మన దేశంలో చాలా బీచ్ లు ఉన్నాయి. అవి చాలా అందంగా ఉంటాయి. అయితే... వాటిని మించిన అందమైన బీచ్ ఒకటి ఉంది.

అక్కడికి వెళ్లి ఆ బీచ్ చూస్తే.... చూపు తిప్పుకోలేరు. అలా ఆ బీచ్ ని చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. అదే  యూకేలోని బీచీ హెడ్ బీచ్.  అంతటి అందమైన బీచ్ ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో తెలుసా...? సూసైడ్ బీచ్. నమ్మసక్యంగా లేకపోయినా అది నిజం. ఏటా వేలాది మంది ఆ బీచ్ ని సందర్శించడానికి వెళ్తుంటే... కొందరు మాత్రం చావడానికే ఆ బీచ్ ని ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా మంది ఆ బీచ్ లో శవాలుగా తేలారు. అందుకే దానిని ఇప్పుడు సూసైడ్ బీచ్ గా మార్చేశారు.

ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ నేత కుమారుడు శ్రీహర్ష...యూకేలో చనిపోయిన సంగతి తెలిసిందే. అతను చనిపోయింది కూడా ఈ బీచ్ లోనే కావడం గమనార్హం. ఈ బీచ్ గురించి తెలిసిన వారు ఎవరైనా.. శ్రీ హర్ష మృతి కూడా ఆత్మహత్యగానే భావిస్తారు. 2004 నుంచి ఈ బీచ్ లో 5,500మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం.

ఇక ఈ బీచ్ విషయానికి వస్తే... దక్షిణాది ఇంగ్లాండ్ లోని ఈస్ట్ బోర్న్ సిటీ ప్రాంతంలో వుండే ఈ కోస్టల్ ఏరియాలో ఉంది. 17వ శతాబ్దం నుంచి ఈ బీచ్ సూసైడ్ లకు ప్రసిద్ధిగాంచింది. అందమైన సూసైడ్ స్పాట్ గా పేరొందింది.
 
సాధారణంగా బీచ్ దగ్గర మనం నడుస్తూ ఉంటే నీరు మన పాదాలకు తగులుతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం సముద్రాన్ని బీచ్.. 531 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదో కొండలాగా... దాని కింద సముద్రంలాగా ఉంటుంది. ఆ కొండపై నుంచి కిందకు దూకే అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లోనూ దాదాపు 10మందికిపైగే అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. సంవత్సరానికి కనీసం 20మంది ఇక్కడ ప్రాణాలు వదలుతున్నారు. 

వీటిని అడ్డుకోవడానికి కొన్ని ప్రత్యేక బృందాలను అక్కడ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. ఈ సూసైడ్స్ మాత్రం ఆగడంలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.

click me!