'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21నుండి వైరస్ పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. రెండున్నర లక్షల మందికి పైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచంలోని అన్ని దేశాల్లోని పరిశోధకులు, శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు వైరస్ ను కనుగొనలేకపోయారు.
కాగా.. తాజాగా ఈ వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ చేసిన తాజా హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి. కరోనా ఎప్పటికీ పోదంటూ డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక జారీ చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది.
undefined
'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21నుండి వైరస్ పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.
కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు.
కేసుల సంఖ్య పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ ఎత్తివేడయం వల్ల మరింత మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిని నిరోధించే వ్యాక్సిన్, టీకాల కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో తెలియదు, దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్ కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలను తగ్గించాలని యోచిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం