పాకిస్తాన్ లో చైనా కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

By telugu team  |  First Published Apr 24, 2020, 8:36 AM IST

కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్ పాకిస్తాన్ లో జరగనున్నాయి. చైనా ఫార్మాసూటికల్ కంపెనీ పాకిస్తాన్ ఆరోగ్య సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఇస్లామాబాద్: కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా ఫార్మాసూటికల్ కంపెనీ పాకిస్తాన్ జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్)తో కలిసి పనిచేయనుంది. ఈ వ్యాక్సిన్ కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించడంలో ఫలితం సాధిస్తుందా, ఏమైనా ఇతర ఆరోగ్య సంస్యలు తలెత్తుతాయా అనే విషయం ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా తేలనుంది. 

వచ్చే మూడు నెలల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని పాకిస్తాన్ మీడియా తెలిపింది. కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. క్లినికల్ ట్రయల్స్ ఫలితం సాధిస్తే చైనా నుంచి అన్ని దేశాల కన్నా ముందు తమకు ఆ వ్యాక్సిన్ అందుతుందని పాకిస్తాన్ భావిస్తోంది.

Latest Videos

పలు క్లినికల్ ట్రయల్స్ పలు దశల్లో చేసిన తర్వాతనే మనుషులకు ప్రమాదం లేదని గుర్తించారు. మనుషుల మీద ప్రయోగించడానికి ముందు వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగిస్తారు. మనుషుల మీద, జంతువుల మీద ఈ వ్యాక్సిన్ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వదు. 

మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రమాదానికి కారణం కావచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు లేదా జీవసంబంధమైన సమస్యలు తలెత్తవ్చచు. స్వైన్ ఫ్లూ కన్నా పదింతలు కరోనా వైరస్ ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఏప్రిల్ 13వ తేదీన చెప్పారు. వ్యాక్సిన్ మాత్రమే దాని వ్యాప్తిని అరికడుతుందని అన్నారు. 

పాకిస్తాన్ లో 11 వేల మంది కరోనా వైరస్ రోగులు ఉన్నారు. దాదాపు 230 మంది మరణించారు. కొద్ది రోజుల్లో అది మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని పాకిస్తాన్ భావిస్తోంది. వచ్చే వారానికి కరోనా వైరస్ కేసులు 20 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య 500 దాటవచ్చునని అంటున్నారు.

click me!