షాకింగ్.. మెదడు తినే అమీబా.. ఇన్ఫెక్షన్‌తో బాలుడు మృతి.. పూర్తి వివరాలు ఇవే

By Mahesh KFirst Published Aug 18, 2022, 8:12 PM IST
Highlights

అమెరికాలో అరుదుగా కనిపించే భయానకమైన అమీబా నయిగ్లేరియా ఫోలేరీ సోకి ఓ బాలుడు మరణించాడు. ఇది సోకిన వారం రోజులకు ప్రాణాలొదిలాడు. ఈ అమీబా మనిషి బాడీలోకి ప్రవేశించి మెదడు తింటుందని నిపుణులు చెబుతున్నారు.
 

న్యూఢిల్లీ: అమెరికాలో అరుదైన వ్యాధితో ఓ బాలుడు మరణించాడు. ఆ బాలుడికి మెదడు తినేసే అమీబా సోకింది. ఆ అమీబా పేరు నయిగ్లేరియా ఫొలేరి. నెబ్రస్కా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, అమెరికాలో ఇదే తొలి మరణం.

ఒమాహాలోని డగ్లస్ కౌంటీకి చెందిన బాలుడికి ఈ అమీబా సోకింది. ఆయన మెదడు తిన్నది. ఓ ఆదివారం ఆ బాలుడు ఎల్కార్న్ నదిలో ఈత కొట్టాడు. బహుశా ఈ నది ద్వారానే బాలుడికి ఆ అమీబా సోకినట్టుగా చెబుతున్నారు. ఆ అమీబా సోకగానే అనారోగ్యానికి గురయ్యాడు. హాస్పిటల్‌లో బాలుడిని చేర్పించారు. వారం తర్వాత ఈ డిసీజ్ కారణంగా మరణించినట్టు డగ్లస్ కౌంటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కాగా, ఈ కేసును ధ్రువీకరించుకోవడానికి యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) ఇంకా పరీక్షలు జరుపుతూనే ఉన్నది.

నయిగ్లేరియా ఫోలేరీ అంటే ఏమిటీ?
నయిగ్లేరియా ఫోలేరి అనేది అరుదుగా కనిపించే ప్రాణాంతకమైన అమీబా. ఇది సాధారణంగా ఉష్ణంగా ఉన్న నదులు, కొలనులు, చెరువుల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అమీబా ముక్కు ద్వారా మన బాడీలోకి చేరి నేరుగా మెదడుకు చేరుకునే అవకాశం ఉన్నది. ఈ అమీబా ఉన్న నీటిలోకి డైవ్ చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయ్యే ముప్పు ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కలుషిత నీటిని తాగడం మూలంగా లేదా క్లోరినేటెడ్ పూల్స్‌లో ఈత కొట్టినా ఈ అమీబా మన దేహంలోకి ప్రవేశించదని వివరిస్తున్నారు. ఈ అమీబా సోకిన వారిలో బ్రతికే అవకాశాలు 97 శాతం లేదని అంచనా వేశారు. అమెరికాలో తొలిసారిగా ఈ అమీబాను 1962లో గుర్తించారు. అప్పటి నుంచి 154 మంది దీని బారిన పడ్డారు. ఈ 154 మందిలో నలుగురు మాత్రమే బతికి బట్టకట్టగలిగారు.

click me!