నదిలోకి దూసుకెళ్లిన విమానం: 136 మంది ప్రయాణికులు

By telugu teamFirst Published May 4, 2019, 10:26 AM IST
Highlights

136 మంది ప్రయాణికులతో బోయింగ్‌ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో విమానం జాక్సన్‌విల్లేలోని సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

వాషింగ్టన్‌: అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రమాదకరమైన సంఘటన చోటు చేసుకుంంది.  ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పిన బోయింగ్‌ 737 కమర్షియల్‌ జెట్‌ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 

136 మంది ప్రయాణికులతో బోయింగ్‌ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో విమానం జాక్సన్‌విల్లేలోని సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకువెళ్లిందని నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని జాక్సన్‌విల్లే మేయర్‌ ట్వీట్‌ చేశారు. వారంతా బతికే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై జాక్సన్‌విల్లే షరిఫ్స్‌ ఆఫీస్‌ కూడా స్పందించింది. 

ప్రమాద సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని ట్వీట్‌ చేసింది. విమానం నదిలో మునగకపోవడంతో ప్రమాదం తప్పింది. 

click me!