నైజీరియాలో పెను విషాదం.. పడవ బోల్తా పడి 103 మంది మృతి.. కొనసాగుతున్నసెర్చ్ ఆపరేషన్..

Published : Jun 14, 2023, 05:18 AM ISTUpdated : Jun 14, 2023, 05:54 AM IST
నైజీరియాలో పెను విషాదం.. పడవ బోల్తా పడి 103 మంది మృతి.. కొనసాగుతున్నసెర్చ్ ఆపరేషన్..

సారాంశం

Nigeria Boat Capsizes: నైజీరియాలో పడవ బోల్తా పడడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర నైజీరియాలో వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడడంతో దాదాపు 100 మంది చనిపోయారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోందని పోలీసులు,స్థానిక నివాసితులను ఉటంకిస్తూ ఏజెన్సీ పేర్కొంది.

Nigeria Boat Capsizes: దక్షిణ ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 103 మంది మరణించారు.ఉత్తర మధ్య నైజీరియాలో పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న అతిథుల పడవ నీట మునిగింది. ఈ ప్రమాదంలో 103 మంది మునిగిపోయారని నైజీరియా పోలీసులు తెలిపారు.  

నైజర్ స్టేట్‌లోని వివాహ వేడుక నుంచి క్వారా రాష్ట్రంలో ప్రజలను తీసుకువెళుతుండగా నదిలో పడవ మునిగిపోయిందని, అన్వేషణ కొనసాగుతోందని  గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వలన, వర్షాకాలంలో భారీ వరదల కారణంగా నదిలో పడవ బోల్తాపడిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 

ఇప్పటి వరకు పడవ ప్రమాదంలో 103 మంది మరణించారని,మరో 100 మందిని రక్షించామని క్వారా రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మి అజయ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మృతుల్లో పటిగిలోని ఎబు, జకాన్, క్పడా, కుచలు, సంపి నివాసితులు.

ఈ ఘటన తర్వాత పోలీసులు, స్థానికులు కలిసి ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. నైజీరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం గమనార్హం. ఇక్కడి ప్రజలు తరచుగా స్థానికంగా తయారైన ఓడలను ఉపయోగిస్తారు, దీని కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గత నెలలో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది.  ఓవర్‌లోడ్‌ కారణంగా పడవ బోల్తా పడి 15 మంది పిల్లలు మునిగిపోగా మరో 25 మంది అదృశ్యమయ్యారు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?