ఆ దేశాలతో కరోనా టీకా ఫార్ములా పంచుకోవద్దు.. బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు...

By AN TeluguFirst Published Apr 30, 2021, 4:33 PM IST
Highlights

కరోనా టీకా ఫార్ములాను పంచుకోవద్దని భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలనుద్దేశించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సెంకడ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ సూచన చర్చనీయాంశంగా మారింది. 

కరోనా టీకా ఫార్ములాను పంచుకోవద్దని భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలనుద్దేశించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సెంకడ్ వేవ్ భారత్ ను వణికిస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ సూచన చర్చనీయాంశంగా మారింది. 

ప్రపంచమంతా కరోనాతో అల్లకల్లోలం అవుతున్న సమయంలో బిల్ గేట్స్  వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  కోవిడ్ 19 తో భారతదేశం తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ప్రపంచం మొత్తం భారత్ కు మద్దతునందిస్తోంది. 

ఈ సయమంలో టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ విషయంలో టెక్నాలజీ, పేటెంట్లకు సంబంధించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్సలతో ఆయన తీవ్ర విమర్శలనెదుర్కొంటున్నారు. 

కోవిడ్ వ్యాక్సిన్ల సూత్రాలను పంచుకునేందుకు వీలుగా మేథో సంపత్తి చట్టాన్ని మార్చడం సాధ్యమా? అంటూ స్కై న్యూస్ ఇంటర్వ్యూలో గేట్స్ ను ప్రశ్నించగా.. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాక్సిన్ సూత్రాలను పంచుకోవడం సరికాదు’ అంటూ ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. 

ఆ సమాధానం మీద వివరణ కోరగా ‘ప్రపంచంలో టీకాలు తయారు చేసే కర్మాగారాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాక్సిన్ ఫార్ములా పంచుకోకూడదు. అమెరికాలోని జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీకి భారత్ లోని వ్యాక్సిన్ల తయారీ కర్మాగారానికి చాలా తేడా ఉంది. మా నైపుణ్యం, డబ్బు విజయవంతమైన వ్యాక్సిన్ ను తయారు చేస్తాయి’ అని పేర్కొన్నారు. 

అంతేకాదు కరోనా టీకా ఫార్ములా ఎవరితోనైనా పంచుకోగలిగే పేటెంట్ లాంటిది కాదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!