బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ ఖలీఫా..!

By AN TeluguFirst Published Nov 12, 2020, 1:30 PM IST
Highlights

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నియమితులయ్యారు. సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన 84వ యేట బుధవారం నాడు మరణించారు.

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నియమితులయ్యారు. సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన 84వ యేట బుధవారం నాడు మరణించారు.

1971 నుండి ఆయన బ్రహెయిన్ కు ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి ఆయన ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు ప్రధానిగా పనిచేసిన రికార్డు ఖలీఫా పేరున ఉంది.

బహ్రెయిన్‌కు దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రధానిగా కొనసాగిన షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌  స్థానంలో బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాను నియమించారు. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆర్డర్ 44/2020ను జారీ చేశారు. 

అధికారిక గెజిట్ వెలువడిన వెంటనే రాయల్ ఆర్డర్ అమలులోకి వస్తుంది. అనంతరం ప్రిన్స్ సల్మాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా, ప్రిన్స్ సల్మాన్ ప్రస్తుతం డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతూ మృతిచెందిన ప్రధాని ఖలీఫా... ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన నేతగా నిలిచారు. 

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖలీఫా అంత్యక్రియలకు సమీప బంధువులను మాత్రమే అనుమతించనున్నట్టుగా ఓ వార్తా సంస్థ తెలిపింది. దేశంలో వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. మూడు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
 

click me!