రెండు పురుషాంగాలతో శిశువు జననం

Published : Nov 20, 2020, 11:14 AM IST
రెండు పురుషాంగాలతో శిశువు జననం

సారాంశం

రెండు అంగాలకు చెరొక వృషణ సంచి ఉండంతో ఆ రెండు అంగాల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందట. దీనికి తోడు రెండు మలద్వారాలకు సంబంధించి శరీరంలో రెండు పెద్ద పేగులు కూడా ఉన్నాయి. 

ఈజిప్టులో ఓ మహిళ వింతు శిశువు కి జన్మనిచ్చింది. ఇప్పటి వరకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు లేదంటే రెండు తలలతో పుట్టిన వింత శిశువు లు జన్మించడం విని ఉంటారు. కాగా.. ఈ శిశువు మాత్రం  రెండు పురుషాంగాలతో జన్మించడం విశేషం. 

పురుషాంగమే కాదు.. వృషణ సంచులు, మలమూత్ర విసర్జనకు సంబంధించిన అవయవాలు రెండేసి ఉన్నాయి. రెండు పురుషాంగాలకూ మూత్ర నాళికలున్నాయి. అంటే.. రెండు అంగాల నుంచి ఆ శిశువు మూత్రం పోయగలడు. అంతేకాదు.. రెండు అంగాలకు చెరొక వృషణ సంచి ఉండంతో ఆ రెండు అంగాల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందట. దీనికి తోడు రెండు మలద్వారాలకు సంబంధించి శరీరంలో రెండు పెద్ద పేగులు కూడా ఉన్నాయి. 

పిల్లాడిని తల్లి గర్భం నుంచి బయటకు తీయగానే డాక్టర్లంతా షాకైపోయారు. అయితే భవిష్యత్తులో అతనికి ఇబ్బంది కలుగవచ్చని అంటున్నారు. రెండు పురుషాంగాలు ఉండటం వల్ల దాంపత్య జీవితానికి కష్టంకావచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ బాలుడు అలా పుట్టడానికి కాడల్ డూప్లికేషన్ సిండ్రోమ్ అనే రుగ్మతే కారణమట. ఈ విషయాన్ని పీడియాట్రిక్ సర్జరీ నిపుణులు అహ్మద్ మహెర్ అలీ తెలిపారు.

కవలలు పుట్టాల్సి ఉండగా..వారు విడిపోకపోవడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ఇలా పుట్టిన పసివాళ్లకు రెండేసి అవయవాలు ఉంటాయని వాటిని విడదీయడం అసాధ్యమని వివరించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని, అతడికి ఉన్న రెండు వృషణ సంచుల్లో ఒకదానికి 16 నెలల తర్వాత సర్జరీ చేసి పనిచేయకుండా చేస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ