కరోనా ఎఫెక్ట్: ఇండియా విమానాలపై అస్ట్రేలియా నిషేధం

Published : Apr 27, 2021, 12:20 PM IST
కరోనా ఎఫెక్ట్: ఇండియా విమానాలపై  అస్ట్రేలియా నిషేధం

సారాంశం

కరోనా కేసులు భారీగా నమోదౌతున్న నేపథ్యంలో ఇండియా నుండి వచ్చే విమానాలపై అస్ట్రేలియా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టుగా  అస్ట్రేలియా మంగళవారం నాడు ప్రకటించింది. 

సిడ్నీ: కరోనా కేసులు భారీగా నమోదౌతున్న నేపథ్యంలో ఇండియా నుండి వచ్చే విమానాలపై అస్ట్రేలియా తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టుగా  అస్ట్రేలియా మంగళవారం నాడు ప్రకటించింది. ఈ ఏడాది మే 15వ తేదీ వరకు ఈ నిషేధం విధిస్తున్నట్టుగా అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఇదే తరహాలో కెనడా, యూఏఈ, బ్రిటన్ లు ఇండియాకు చెందిన విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇండియా విమానాలపై నిషేధం విధించినప్పటికీ కూడ కరోనా కేసుల నేపథ్యంలో మెడికల్ సహాయం అందించడంలో  అస్ట్రేలియా ముందు వరుసలోనే ఉంది.  ఆక్సిజన్ ట్యాంకులు, వెంటిలేటర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. ఇండియాలో కరోనా కేసులు  రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసుల పెరుగుదలతో వరుసగా ఆరు రోజులుగా ఇండియాలో మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ లు, నైట్ కర్ఫ్యూను విధించాయి.  

 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?