దారుణం.. పాకిస్థాన్ లో పోలీసు స్టేషన్ పై తాలిబన్ల దాడి.. వాహనానికి నిప్పు పెట్టి, ఇద్దరు పోలీసుల హత్య..

Published : Nov 10, 2022, 03:05 AM IST
దారుణం.. పాకిస్థాన్ లో పోలీసు స్టేషన్ పై తాలిబన్ల దాడి.. వాహనానికి నిప్పు పెట్టి, ఇద్దరు పోలీసుల హత్య..

సారాంశం

పాకిస్థాన్ లోని ఓ పోలీసు స్టేషన్ పై తాలిబన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దుండుగులు పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. ఇద్దురు పోలీసులను హతమార్చారు. 

పాకిస్థాన్ లో దారుణం జరిగింగి. పోలీసు స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం ఇద్దరు పోలీసులు హతమార్చారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని దిగువ వజీరిస్తాన్ జిల్లాలో జరిగింది. ఈ దాడిలో మరో ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యారు. వారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

ఈ దాడి సందర్భంగా ఇద్దరు పోలీసులను చంపడంతో పాటు స్టేషన్ లో ఉన్న ఆయుధాలను కూడా తాలిబన్లు ఎత్తుకెళ్లారు. అలాగే అక్కడే ఉన్న వాహనాన్ని కూడా ఎత్తుకెళ్లారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామే, దీనికి పూర్తి బాధ్యత తమదే అని ఉగ్రవాద సంస్థ టీటీపీ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?