
Russia Ukraine Crisis: చోర్నోబిల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేయబడినట్టు ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దండయాత్రను ప్రారంభించిన రష్యా.. ఆ మర్నాడే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం.. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సమాచార వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయని, దీంతో డేటాను వెల్లడించలేకపోతున్నామని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) పేర్కొన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఉక్రేనియన్ బృందాలు చోర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు ఆఫ్-సైట్ పవర్‌ను పునఃప్రారంభించేందుకు అవసరమైన విద్యుత్ లైన్‌ను మరమ్మతు చేయడంలో విజయం సాధించాయని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రకటించింది.
అలాగే.. చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తెగిపోయిన విదుత్ లైన్లను రిపేరు చేయడాన్ని తమ సాంకేతిక నిపుణులు అద్భుతమైన ప్రయత్నాలకు చేసి.. విజయం సాధించారని ఉక్రెయిన్ ఇంధన మంత్రి హెర్మన్ గలుష్చెంకో కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. నేడు ఉక్రెనియన్ నిపుణుల అద్భుతమైన ప్రయత్నాలకు చేసి విజయం సాధించారు. అణు విద్యుత్ ప్లాంట్లు ఎలక్ట్రీషియన్లు చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌కు శక్తిని పునరుద్ధరించగలిగారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన దేశ విద్యుత్ సరఫరాను అందించడానికి లేదా పునరుద్ధరించడానికి మాకు ఎవరి నుండి ఎటువంటి సహాయం అవసరం లేదనీ అన్నారు. ఇప్పుడు శీతలీకరణ వ్యవస్థలు బ్యాకప్ పవర్ నుండి కాకుండా సాధారణ మోడ్‌లో మళ్లీ పని చేస్తాయని తెలిపారు.
కానీ సైనిక దురాక్రమణ పరిస్థితులలో అణు భద్రతను నిర్ధారించడం అసాధ్యం. అందుకే మా అంతర్జాతీయ భాగస్వాములైన యూరోపియన్ కమిషన్, IAEA, UN, OSCEలను మరో సారి విజ్ఞప్తి చేస్తున్నాం.. అణు సౌకర్యాలను రక్షించడంలో ఉక్రెయిన్ కు సహాయపడండని కోరారు. అలాగే.. శత్రువులు( రష్యా బలాగాలు) అణు విద్యుత్ ప్లాంట్‌ను విడిచిపెట్టాలనీ, ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రాల చుట్టూ 30 కిలోమీటర్ల సైనికరహిత జోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ పవర్ ప్లాంట్ వద్ద 1986లో జరిగిన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. అణు ధార్మికత పశ్చిమ ఐరోపా వ్యాప్తంగా ప్రభావం చూపింది. రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో 200 మంది సాంకేతిక, భద్రత సిబ్బంది అక్కడ చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ప్లాంట్‌లోని సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉందని ఐఏఈఏ పేర్కొంది.
మరోవైపు, ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజియాను రష్యా గతవారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్లాంట్‌పై దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ రియాక్టర్‌లో పేలుడు సంభవించకపోవడంతో ఏలాంటి ప్రమాదం జరగలేదు.