నైట్ క్లబ్ లో తొక్కిసలాట.. ఆరుగురి మృతి

Published : Dec 08, 2018, 03:02 PM IST
నైట్ క్లబ్ లో తొక్కిసలాట.. ఆరుగురి మృతి

సారాంశం

ఆ సమయంలో.. నైట్ క్లబ్ లో దాదాపు వెయ్యి మంది యువతీయువకులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా సందడిగా డ్యాన్సులు చేస్తుండగా.. ఏదో భయంకరమైన కాలుతున్న వాసన వచ్చిందని.. దీంతో భయపడి పరుగులు తీసినట్లు గాయపడిన యువకుడు ఒకరు తెలిపారు. 

నైట్ క్లబ్ లో తొక్కిసలాట జరిగి.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. అంకొనా నగర సమీపంలోని నైట్ క్లబ్ లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా భయపడి.. బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి  వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. కాగా.. అప్పటికే ఆరుగురు చనిపోయినట్లు గుర్తించారు. మరికొందరు గాయలతో బయటపడ్డారు. ఆ సమయంలో.. నైట్ క్లబ్ లో దాదాపు వెయ్యి మంది యువతీయువకులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారంతా సందడిగా డ్యాన్సులు చేస్తుండగా.. ఏదో భయంకరమైన కాలుతున్న వాసన వచ్చిందని.. దీంతో భయపడి పరుగులు తీసినట్లు గాయపడిన యువకుడు ఒకరు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..