చైనాని వణికించిన భూకంపం...11మంది మృతి

By telugu teamFirst Published Jun 18, 2019, 9:49 AM IST
Highlights

చైనాని భూకంపం వణికించింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.

చైనాని భూకంపం వణికించింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.

రిక్టర్ స్కేలుపై  భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా... మరో 122 మందికిపైగా గాయాలపాలయ్యారు. కాగా... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం అర్థరాత్రే సుమారు 30 నిమిషాల పాటు భూమి కంపించగా... సిచువాన్‌ రాజధాని చెంగ్దూ, చాంగ్‌నింగ్‌ నగరాలు షేక్‌ అయ్యాయి. దీంతో జనాలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  

భూమి మొత్తం రెండు సార్లు కంపించగా.. ఒకసారి 5.9, మరో 5.2 తీవ్రతగా రిక్టర్‌ స్కేలుపై నమోదైందని, చాంగ్‌నింగ్‌ సమీపంలోని 10 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్‌ సర్వే విభాగం పేర్కొంది. సిచువాన్ ప్రావిన్స్‌లో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తాయి. 2008 మేలో వచ్చిన భూకంపంతో సుమారు 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

click me!