
ఇరాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఇరాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది ప్రయాణికులు మరణించారు. 50 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఇరాన్ అధికార టీవీ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎడారి నగరమైన తబాస్ సమీపంలో తెల్లవారుజామున రైలులోని ఏడు బోగీలలో నాలుగు పట్టాలు తప్పినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. అక్కడికి రెస్క్యూ బృందాలు బయలుదేరాయి. అది కమ్యూనికేషన్ సరిగా లేని మారుమూల ప్రాంతం కావడంతో.. మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ప్రమాదం జరిగిన చోటు రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 550 కిలోమీటర్లు (340 మైళ్లు) దూరంలో ఉన్న తబాస్‌కు దాదాపు 50 కిలోమీటర్లు (30 మైళ్లు) దూరంలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇక, ఇరాన్‌లో 2016లో జరిగిన మరో రైలు ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇరాన్‌లోని రహదారులపై దాదాపు 17,000 వార్షిక మరణాలను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని worst traffic safety రికార్డులలో ఒకటి. ట్రాఫిక్ చట్టాలను విస్మరించడం, అసురక్షిత వాహనాలు, అత్యవసర సేవలు సరిపడ లేకపోవడం.. మరణాల సంఖ్య అధికంగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది.