
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా నెత్తురోడుతున్న అఫ్ఘానిస్తాన్‌ను గతేడాది ఆగస్టులో తాలిబాన్లు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దేశంలోని హింసాపాతం గురించిన వార్తలు బయటకు వచ్చేవి స్వల్పంగానే ఉంటున్నాయి. ఎందుకంటే.. అక్కడి మీడియాపైనే తాలిబాన్లు కఠిన ఆంక్షలు విధించారు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని అదుపులోకి తెచ్చుకున్నా.. పంజ్‌షిర్ లోయను అధీనం చేసుకోవడం తాలిబాన్లకు కత్తిమీద సాముగా మారిన సంగతి తెలిసిందే. అంతకు ముందూ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించినప్పుడూ పంజ్‌షిర్ ప్రజలు వారికి లొంగలేదు. వారికి ధిక్కారం ఎక్కువ. అందుకే పంజ్‌షిర్ లోయను హస్తగతం చేసుకోవడం తాలిబాన్లకు మరో ఎత్తు అయింది.
ఇప్పటికీ పంజ్‌షిర్‌లో స్థానికుల ధిక్కారం కొనసాగుతూ ఉన్నట్టే కనిపిస్తున్నది. ఇందుకు తాజాగా అక్కడ హింసాత్మక ఘర్షణలు జరిగినట్టు బయటకు వచ్చిన వార్తే నిదర్శనం. పంజ్‌షిర్‌లో కొన్ని చోట్ల ఇంకా మైన్‌లు పాతిపెట్టినట్టు తెలుస్తున్నది. అలాంటి ఓ మైన్‌ను ఢీకొట్టిన తాలిబాన్ వెహికల్ పేలిపోయింది. దీంతో స్థానికులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. పంజ్‌షిర్ ప్రావిన్స్‌లోని పరందేహ్ లోయ చుట్టూ తాలిబాన్లు మోహరించారు. చాలా మంది స్థానికులను అరెస్టు చేసినట్టు స్థానిక వర్గాలు కొన్ని చెప్పాయి. ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఇక్కడ సాయుధ ఘర్షణలు జరుగుతున్నట్టు వివరించాయి.
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లకు కొరకరాని కొయ్యలా మారిన పంజ్ షెర్ ఎట్టకేలకూ గతేడాది సెప్టెంబర్‌లో తాలిబన్ల వశమయ్యింది. ఈ మేరకు తాలిబన్లు అధికారిక ప్రకటన చేశారు.
అమెరికా సైన్యం అఫ్గన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్న అనంతర పరిణామాలను హ్యాండిల్ చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త ఖతార్‌కి బయలుదేరిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది.
20యేళ్లుగా ఆఫ్గన్ లో తిష్ట వేసిన అమెరికా సైన్యాన్ని దెబ్బకొట్టి మెరుపుదాడితో ఆఫ్గన్ ను వశం చేసుకున్న తాలిబన్లు, గత వారం పూర్తిగా అమెరికా సైన్యం దేశాన్ని వదిలిపోవడంతో సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆధీనంలోకి రాకుండా ఎదురు తిరుగుతున్న పంజ్ షెర్ మీద తాలిబన్లు ఎక్కువ దృష్టి పెట్టారు.
ఇక పంజ్ షెర్ మీద ఆధిపత్యం సాధించడంతో.. "ఈ విజయంతో, మన దేశం పూర్తిగా యుద్ధం నుండి బయటపడింది" అని ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు.
ఈ ప్రకటనకు ముందు రోజు అర్థరాత్రి, తాలిబాన్ వ్యతిరేక మిలీషియా, మాజీ ఆఫ్ఘన్ భద్రతా దళాలతో ఏర్పడి నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (NRF) పంజ్‌షీర్ యుద్ధంతో భారీ నష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంగీకరించింది. అంతేకాదు, కాల్పుల విరమణకు పిలుపు నిచ్చింది. ఎన్ఆర్ఎఫ్ లో ప్రఖ్యాత సోవియట్ వ్యతిరేక, తాలిబాన్ వ్యతిరేక కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్‌కు విధేయులైన స్థానిక పోరాట యోధులు, పంజ్‌షీర్ లోయకు చెందిన ఆఫ్ఘన్ మిలిటరీ సభ్యులు ఉన్నారు.
ఆ పోరులో ప్రముఖ ఆఫ్ఘన్ జర్నలిస్ట్ జనరల్ అబ్దుల్ వుడోద్ జారా మరణించాడని ప్రతినిధి ఫాహిమ్ దాష్తి ఆదివారం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్ఆర్ఎఫ్ తాలిబాన్‌లతో పోరాడతానని ప్రతిజ్ఞ చేసింది. అదే సమయంలో ఇస్లామిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పింది. అయితే, ఇనిషియల్ కాంటాక్ట్ ఏ బ్రేక్ థ్రూకూ దారితీయలేదు. పంజ్‌షీర్ లోయ 1980 లలో సోవియట్ దళాలకు, 1990 ల చివరలో తాలిబాన్‌లకు ప్రతిఘటన జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.