Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని హత్యకు కుట్ర‌.. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సంస్థ‌లు

Published : Jun 05, 2022, 02:09 PM IST
Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని హత్యకు కుట్ర‌.. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సంస్థ‌లు

సారాంశం

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు పథకం పన్నారనే వదంతుల నేపథ్యంలో నగరంలోని బని గాలా పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏజన్సీలను అప్రమత్తం చేసినట్లు ఇస్లామాబాద్‌ పోలీసు విభాగం శనివారం రాత్రి తెలిపింది. ఇస్లామాబాద్‌లో ఇప్పటికే సెక్షన్ 144 విధించారు, సమావేశాలను నిషేధించినట్లు ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు.  

Conspiracy killing Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు పథకం పన్నారనే వదంతుల నేప‌థ్యంలో  భ‌ద్ర‌తా  సంస్థలు అప్రమత్తయ్యాయి. ఇస్లామాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను భద్రతా సంస్థలు కట్టదిట్టం చేశాయి భద్రతా ఏజన్సీలు. ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 (ఆర్టికల్ 144) విధించారు. న‌గ‌రంలో  ప్రజలు గుమిగూడడంపై నిషేధం విధించినట్లు ఇస్లామాబాద్ పోలీసు ప్రతినిధి తెలిపారు.

ఇస్లామాబాద్ లోని బనిగాలాలో ఇమ్రాన్ ఖాన్ ఆదివారం పర్యటించనున్నారనే స‌మాచారం మేర‌కు ఆ ప్రాంతంలో భద్రతను పెంచామని, హై అలర్ట్ ప్రకటించామని ఇస్లామాబాద్ పోలీసులు ట్వీట్ చేయడం ద్వారా తెలియజేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ బృందం తిరిగి రావడానికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఖచ్చితమైన సమాచారం అందలేదు. అయినా ఇమ్రాన్ ఖాన్ కు ఎటువంటి హాని జరగకుండా చట్టప్రకారం  కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి. 

జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశానుసారం ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 అమలులోకి తీసుక‌వ‌చ్చామ‌నీ, అలాగే న‌గ‌రంలో ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదు. చట్ట ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని, ఇమ్రాన్ భద్రతా బృందం కూడా అదే పని చేస్తుందని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పై దాడి జరిగితే.. పాకిస్థాన్ పై దాడిగా పరిగణిస్తామని ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు హసన్ నియాజీ అన్నారు. మా నాయకుడికి ఏదైనా జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కుట్రదారులు పశ్చాత్తాపం చెందుతారని అన్నారు. మరోవైపు, ఇమ్రాన్‌ఖాన్‌ హత్యకు కుట్ర పన్నినట్లు పాక్‌ భద్రతా సంస్థలకు ఇప్పటికే సమాచారం అందిందని, ఆయన ఆదివారం ఇస్లామాబాద్‌కు వచ్చారని ఫవాద్‌ చౌదరి తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉండగా, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా భారత్ ను ప్రశంసించడం తెలిసిందే.  త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ అయన ప్రస్తుత సర్కారుకు అల్టిమేటం కూడా జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో మాజీ ప్రధానిని హత్య చేయడానికి కుట్ర (Conspiracy killing Imran Khan) జ‌రుగుతున్న‌ట్టు వాదనలు వ‌స్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే