దుర్వాసన వస్తోందని విమానం నుండి దింపారు

By narsimha lodeFirst Published Jan 26, 2019, 9:05 PM IST
Highlights

అమెరికన్ ఎయిర్‌లైన్స్ లో మిచిగాన్‌కు చెందిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. శరీరం నుండి దుర్వాసన వస్తోందనే నెపంతో 19 నెలల చిన్నారితో పాటు ఆ దంపతులను విమానం నుండి అత్యవసరంగా దించేశారు. 

వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ లో మిచిగాన్‌కు చెందిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. శరీరం నుండి దుర్వాసన వస్తోందనే నెపంతో 19 నెలల చిన్నారితో పాటు ఆ దంపతులను విమానం నుండి అత్యవసరంగా దించేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

మిచిగాన్‌కు చెందిన యోసి ఆడ్లర్‌ అనే వ్యక్తి భార్య, తన చిన్నారితో కలిసి హాలిడే ట్రిప్‌ కోసం మియామీ వచ్చాడు. ట్రిప్‌ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నారు.

బుధవారం విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత.. ఆడ్లర్‌ దంపతులు అత్యవసరంగా విమానం దిగిపోవాలంటూ  అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఈ క్రమంలో తమను దించేయడానికి గల కారణాన్ని ప్రశ్నిస్తే  మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందని ప్రయాణికులతో పాటు, మా సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి మీరు దిగిపోవాల్సిందేనని క్రూ మెంబర్‌ ఇచ్చిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు.

యూదులమనే కారణంగానే తమను అవమానించారని యోసి ఆడ్లర్‌ ఆరోపించారు. తనకు  సంబంధించిన వస్తువులు మాత్రం కార్గోలో వెళ్లిపోయాయన్నారు. మరుసటి రోజు విమానం ఎక్కేవరకు హోటల్‌లో బస చేసేందుకు చాలా ఖర్చయిందని చెప్పారు.మాకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
 

click me!